DailyDose

ఎరువుల బస్తాల ఖరీదు 3ఎకరాలు-నేరవార్తలు

ఎరువుల బస్తాల ఖరీదు 3ఎకరాలు-నేరవార్తలు

* ఏపీ ఫైబర్ నెట్ కేటాయింపులు అక్రమాలపై సిఐడి విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది

* జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ లో విద్యుత్ షాక్ కు గురై 10 ఏళ్ల బాలిక మృతి

* ఎరువుల బస్తాల బాకీ కింద ఫర్టిలైజర్ షాపు యజమాని మూడు ఎకరాల భూమిని పట్టా చేసుకున్నాడనే మనస్థాపంతో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్లలో ఆదివారం చోటు చేసుకుంది.

* గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నాటు సారాయి తయారీ కేంద్రాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నాటు పడవలపై ప్రయాణం చేసి దాడులు నిర్వహించారు

* పగలు… రాత్రి తేడా లేకుండా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ… కొందరు వ్యక్తులు మోటారు సైకిళ్లపై మెరుపులా వచ్చి రహదారిపై వెళ్తున్న లారీలు, కార్లను హఠాత్తుగా ఆపుతారు. సొమ్ము ఇవ్వాలని వాహనదారులు, డ్రైవర్లను కత్తులతో బెదిరిస్తారు. మరో ప్రాంతంలో రాత్రి వేళ లారీ ఆగిందంటే చాలు… గద్దల్లా వాలిపోతారు. క్యాబిన్‌లో ఆదమరిచి నిద్ర పోతున్న డ్రైవర్లను తట్టి లేపుతారు. వారి వద్ద ఉన్న నగదు ఇవ్వాలని అడుగుతారు. ఇస్తే సరి… లేకుంటే భయాందోళనలకు గురి చేసి మరీ డబ్బులు లాక్కుని పరారవుతారు. సినిమా తరహాలో కంచికచర్ల ప్రాంతంలో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు లారీ డ్రైవర్లలో గుబులు రేపుతున్నాయి. లారీలను లక్ష్యంగా చేసుకుని కొందరు డ్రైవర్లను బెదిరించి నగదు వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేని డ్రైవర్లు నగదు దుండగులకు అప్పజెప్పి తమ గోడును పోలీసులకు వెళ్లబోసుకుంటున్నారు.