WorldWonders

చికాగో పాఠశాలల్లో అయిదో తరగతి నుండి అందుబాటులో కండోంలు

చికాగో పాఠశాలల్లో అయిదో తరగతి నుండి అందుబాటులో కండోంలు

అమెరికాలోని షికాగో పబ్లిక్​ స్కూల్స్ ఎడ్యుకేషన్​ (సీపీఎస్‌) బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదు, ఆపై తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్‌లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టనుంది. ఈ నిబంధన ఆ బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు​ ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తించనుంది. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. 2020 డిసెంబర్​లోనే సీపీఎస్​ బోర్డు ఈ విధానాన్ని రూపొందించింది. సెక్స్​ ఎడ్యుకేషన్​లో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నది బోర్డు అభిప్రాయం. ఇక నుంచి ఎలిమెంటరీ స్కూళ్లలో 250, హైస్కూళ్లలో 1000 వరకు కండోమ్‌లు​ అందుబాటులో ఉంటాయి. షికాగో ఆరోగ్యశాఖ సహకారంతో కండోమ్‌లను సరఫరా చేస్తారు. కండోమ్స్​ అందించడమే కాకుండా.. విద్యార్థులకు శరీర నిర్మాణ శాస్త్రం, కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం వంటి అంశాలను బోధిస్తారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసే తల్లిదండ్రులు బోర్డుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించింది సీపీఎస్.