Kids

కృష్ణదేవరాయుల కుక్కను నదిలో పారేసిన తెనాలి రామకృష్ణుడు

కృష్ణదేవరాయుల కుక్కను నదిలో పారేసిన తెనాలి రామకృష్ణుడు

ఒక సారి శ్రీ‌కృష్ణ దేవ‌రాయలు త‌న పెంపుడు కుక్క‌తో ప‌డ‌వ‌లో ప్ర‌యాణిస్తున్నారు. కుక్క‌కి సౌక‌ర్యంగా లేదేమో మొరుగుతూ తెగ అల్ల‌రి చేస్తోంది. విసుక్కున్నారు రాయ‌ల‌వారు. కుక్క‌ని అదుపులో పెట్ట‌డం ఎవ‌రి వ‌ల్లా కావటంలేదు. ఇంత‌లో అక్క‌డే ఉన్న తెనాలి రామ‌కృష్ణుడు వ‌చ్చి మహారాజా త‌మ‌రు అనుమ‌తిస్తే కుక్క‌ని నేను అదుపు చేస్తాను అన్నాడు. స‌రేన‌న్నారు రాయ‌ల‌వారు. వెంట‌నే తెనాలి రామకృష్ణ ఆ కుక్క‌ని తీసుకుపోయి న‌దిలో పారేశారు కుక్క ప్రాణ‌భ‌యంతో ఈత కొడుతోంది. కాసేప‌య్యాక కుక్క‌ని మ‌ళ్ళీ ప‌డ‌వ‌లోకి తెప్పించాడు తెనాలి రామ‌కృష్ణ. అంతే కుక్క ఓ మూల‌కి పోయి మొర‌గ‌కుండా, అల్ల‌రి చేయ‌కుండా ముడుచుకుని ప‌డుకుంది. ఈ చ‌ర్య‌కి ఆశ్చ‌ర్య‌పోయిన రాయ‌ల వారు ఏం మాయ చేశావు రామ‌కృష్ణా అని అడిగారు. దానికి రామ‌కృష్ణ న‌వ్వేసి, మ‌హారాజా లోకంలో అంద‌రూ త‌నున్న స్థితికి తృప్తి ప‌డ‌కుండా ఇంకా ఏదో కావాల‌ని ఆశ ప‌డ‌తారు. నీటిలో ప‌డేశాక అంత‌కు ముందు త‌నెంత సుర‌క్షిత ప్ర‌దేశంలో వున్న‌దో అర్ధ‌మై కుక్క‌కి ఙ్ఞానోద‌యం అయింది అన్నాడు. అలాగే మ‌న పిల్ల‌ల‌కు ఎన్ని సౌక‌ర్యాలు క‌ల్పించినా వాటి విలువ అర్ధం కావ‌డం లేదు. సంతానం మీద ్ర‌పేమ ఉండ‌వ‌చ్చు తప్పులేదు… కానీ ప‌రిధులు దాటి ్ర‌పేమిస్తే వాళ్ల సుఖ‌మ‌య జీవితానికి మీరే అడ్డంకులు అవుతారు. ఎందుకూ ప‌నికిరాకుండా సోమ‌రిపోతుల్లా త‌యారై ఎల్ల‌వేళ‌లా మీమీదే ఆధార‌ప‌డే ప‌రిస్థితి రావ‌చ్చు… క‌దా..? కాబ‌ట్టి క‌ష్టం యొక్క విలువ‌ను పిల్ల‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలిసేలా… స‌మాజంలో ఏ మాత్రం సౌక‌ర్యాలు లేకుండా జీవించే వారిని చూపించి వారికి అర్థ‌మ‌య్యేలా తెలియ‌జేయాలి.