DailyDose

తిరుపతిలో అక్రమంగా నివసిస్తున్న చైనీయులు-నేరవార్తలు

Illegal Chinese Immigrants Arrested In Tirupati

* నగరంలోని పాతబస్తీ పరిధిలో చోరీకి గురైన 66 మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తిరిగి వాటిని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మంగళవారం బాధితులకు అప్పగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్‌ ఫోన్లు చోరీకి గురైతే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు.మీ సేవ, హాక్‌ ఐ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.ఫోన్లు రికవరీ చేసిన అనంతరం వెంటనే బాధితులకు సమాచారం ఇస్తామన్నారు.

* వరంగల్ రూరల్ : ఓ ఫర్టిలైజర్ వ్యాపారి నుంచి రూ. 10 వేల లంచం తీసుకుంటు నెక్కొండ మండల వ్యవసాయ అధికారి సంపత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు.

* ఇద్దరు చైనా పౌరులు అరెస్టు.తిరుపతిలో నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు చైనా పౌరులు అరెస్టు.నిర్దేశించిన గడువు ముగిసినా స్వదేశానికి వెళ్లని ఇద్దరు చైనా వాసులు.చైనా దేశీయులు రేణిగుంట బిగ్ కిచెన్‌లో పనిచేస్తున్నారు: తిరుపతి ఎస్పీ.కేంద్ర హోంశాఖకు సమాచారం ఇచ్చామన్న తిరుపతి అర్బన్ ఎస్పీ.భద్రతా కోణాల్లోనూ ప్రశ్నించామన్న తిరుపతి ఎస్పీ అప్పలనాయుడు.

* అమరావతి భూముల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.ఈ నెల 22న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.భూములపై సీఐడీ, సిట్ దర్యాప్తును నిలుపుదల చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది.దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ వినీత్ శరణ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ థావన్‌ వాదనలు వినిపించారు.ఈ అంశంపై హైకోర్టులోనే పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సి ఉందన్న రాజీవ్ థావన్‌ పిటిషన్‌ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.అమరావతి భూముల విషయంలో సీబీఐతో దర్యాప్తు చేయించినా తమ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు.

* మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతకు కడప న్యాయవాది సుబ్బారాయుడు లేఖ రాశారు.వివేకా హత్య కేసులో సాక్ష్యాలుంటే సీబీఐకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.సుబ్బారాయుడు రాసిన లేఖపై ఆమె పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.మరోవైపు సునీతకు రాసిన లేఖను కేంద్ర గ్రీవెన్స్ సెల్​కు సైతం సుబ్బారాయుడు పంపారు.వైఎస్‌ వివేకా హత్యకేసులో 37వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది.కడప కేంద్రకారాగారం అతిథిగృహంలో నేడు ఐదుగురు అనుమానితులను సీబీఐ ప్రశ్నిస్తోంది.వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, వాచ్​మెన్​ రంగన్న, ఇద్దరు కుమారులతోపాటు పులివెందుల పెట్రోల్ బంక్ యజమాని సుబ్బారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.