Politics

రాహుల్ గాంధీకి ప్రమోషన్-తాజావార్తలు

రాహుల్ గాంధీకి ప్రమోషన్-తాజావార్తలు

* కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అధిష్ఠానం కొత్త బాధ్యతలు కట్టబెట్టనుంది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల కంటే ముందుగా మరో కీలక పదవి కట్టబెట్టడానికి అధిష్ఠానం రెడీ అయ్యింది. లోక్‌సభలో కాంగ్రెస్ నేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధీర్ రంజన్ చౌదరి స్థానంలో రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇందుకు రాహుల్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. అధీర్ స్థానంలో మనీశ్ తివారీ, లుధియానా, థరూర్, గౌరవ్ గొగోయ్ వీరిలో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పజెప్పనున్నారని వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా రాహుల్ గాంధీ పేరు తెరపైకి వచ్చింది.

* కేంద్రమంత్రి పీయూష్ గోయల్​కు భాజపా అధిష్ఠానం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. రాజ్యసభలో భాజపాపక్ష నేతగా ఆయన్ను నియమించింది.

* కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఇంతియాజ్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌కు హైకోర్టు వారెంట్లు జారీ చేసింది.వారెంట్లను అమలు చేయాలని విజయవాడ సీపీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది.కృష్ణా జిల్లా నందిగామలో 20 మంది అర్హులకు జగనన్న చేయూత పథకం అమలు చేయకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.గ్రామ సభలో ఆమోదించిన తర్వాత కూడా పథకం అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించారని న్యాయవాది ప్రభాకర్ పిటిషన్ వేశారు.

* గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు పట్టం కడితే ప్రతినెలా 300 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తామని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాగ్దానం చేశారు.

* పంజాబ్ ప్రభుత్వ ‘రుణ మాఫీ పథకం’ కింద సేద్యం మీద ఆధారపడిన కూలీలు, కౌలు రైతులకు రూ.590 కోట్ల రుణాలను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారంనాడు ప్రకటించారు.

* దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకోబ్ జూమా అరెస్ట్ అనంతరం దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.

* కాంగ్రెస్ సమాయత్తం..బాధ్యత వీరిదే!హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది.నియోజకవర్గంలో బలమైన నేతగా పేరున్న పాడి కౌశిక్‌రెడ్డి రాజీనామా చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది.ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఉప ఎన్నికకు సమాయత్తమయ్యే క్రమంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పీసీసీ ఇన్‌చార్జిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు బాధ్యతలు అప్పగించింది.ఎన్నికల సమన్వయకర్తలుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లను నియమించింది.అదే విధంగా వివిధ మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్‌చార్జీలను నియమించింది.ఈ మేరకు టీపీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

* తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16 వ తారీఖున సాలకట్ల ఆణివార ఆస్థానం ఉన్న కారణంగా జూలై 15న వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

* అలిపిరి నడకమార్గం మరో రెండు నెలలు పాటు మూసివేత.

* గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం గొడవర్రులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం ఉదయం పర్యటించారు.

* భారత్​లో కరోనా కేసులు మంగళవారంతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. కొత్తగా..38,792 మందికి వైరస్​ సోకింది. వైరస్ బారిన పడి 624 మంది ప్రాణాలు విడిచారు. కొత్తగా 41,000 మంది వైరస్​ను జయించారు.

* పుల్వామాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుధవారం తెల్లవారుజామున కశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి.