Business

మాస్టర్‌కార్డ్‌పై RBI నిషేధం-వాణిజ్యం

మాస్టర్‌కార్డ్‌పై RBI నిషేధం-వాణిజ్యం

* 3 నెలల్లో రూ.8వేల కోట్లు అప్పు తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్…. 6 వేల కోట్లు అప్పు తీసుకోనున్న తెలంగాణ దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.1,92,091 కోట్ల రుణ సేకరణకు సిద్ధమయ్యాయి.- ఇందుకు సంబంధించిన క్యాలెండర్‌ను ఆర్‌బీఐ విడుదల చేసింది.★ ఈ త్రైమాసికంలో తెలంగాణ ప్రభుత్వం 4 విడతల్లో రూ.6 వేల కోట్ల రుణం సేకరించనుంది.★ జులై 27న రూ.1,000 కోట్లు, ఆగస్టు 10న రూ.2,000, ఆగస్టు 24న రూ.1,000, సెప్టెంబర్‌ 7న రూ.2,000 కోట్లు తీసుకోనుంది.★ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 5 విడతల్లో మొత్తం రూ.8 వేల కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధమైంది.★ బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం ద్వారా రాష్ట్రాలు ఈ రుణాన్ని సేకరించనున్నాయి…

* డేటా స్టోరేజీ నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్‌ కార్డ్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. కొత్తగా తన డెబిట్‌, క్రెడిట్‌, ప్రీపెయిడ్‌ నెట్‌వర్క్‌లోకి వినియోగదారులను చేర్చుకోకుండా ఆంక్షలు విధించింది. జులై 22 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటికే మాస్టర్‌ కార్డు వినియోగిస్తున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

* దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా ఏడు సీట్ల మోడల్‌ బొలెరో నియోను విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.8.48 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. ఎస్‌యూవీ కోసం చూస్తున్న వినియోగదారుల అవసరాలను కొత్త బొలెరో తీరుస్తుందని, అధునాతన లుక్‌తో తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బొలెరో నియోతో పాటు ప్రస్తుత బొలెరో మోడల్‌ అమ్మకాలను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. అగ్రగామి 10 ఎస్‌యూవీల్లో బొలెరో స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కొత్త నియో దోహదపడుతుందని కంపెనీ సీఈఓ ఆటోమోటివ్‌ విభాగం వీజే నక్రా ఆశాభావం వ్యక్తం చేశారు. డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ, కార్నరింగ్‌ బ్రేక్‌ కంట్రోల్, ఐసోఫిక్స్‌ ఛైల్డ్‌ సీట్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో అమర్చిన మహీంద్రా ఎంహాక్‌ ఇంజిన్‌ 100 హెచ్‌పీ శక్తిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

* ప్రముఖ లగ్జరీ వాహన తయారీ దిగ్గజం బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ చివరకు తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇటీవల బీఎమ్‌డబ్ల్యూ సీఈ 04 పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నీ స్కూటర్ల కంటే చాలా విభిన్నంగా ఉంది. ఈ బీఎమ్‌డబ్ల్యూ సీఈ 04 మోడల్ ధర £11,700(సుమారు రూ.10,29,102)గా ఉంది. డిఫరెంట్ రాడికల్ స్టైల్, ఫ్యూచరిస్టిక్ డిజైన్, అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో బీఎమ్‌డబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారు చేశారు. ఇది చూడాటానికి స్కేట్ బోర్డ్ మాదిరిగా ఉంది.

* ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) భారత మార్కెట్‌లోకి ల్యాండ్ రోవర్ డిస్కవరీ కొత్త వెర్షన్‌ను బుధవారం రోజున విడుదల చేసింది. కొత్త డిస్కవరీలో న్యూ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, ఫ్రెష్ ఫ్రంట్ రియర్ బంపర్లను అమర్చారు. అంతేకాకుండా కారు ఇంటిరీయర్స్‌లో న్యూ పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్‌తో 11.4 అంగుళాల హెచ్‌డి టచ్‌స్క్రీన్‌​ను ఏర్పాటు చేశారు.