Politics

సజ్జలకు ఓఎస్డీగా తెలంగాణ అధికారి

సజ్జలకు ఓఎస్డీగా తెలంగాణ అధికారి

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ‎ఓఎస్‌డీగా దశరథరామిరెడ్డి నియామించారు. ప్రస్తుతం దశరథరామిరెడ్డి తెలంగాణ జైళ్లశాఖ సూపరింటెండెంట్‌గా ఉన్నారు. దశరథరామిరెడ్డిని డిప్యుటేషన్‌పై నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. దశరథరామిరెడ్డిని తక్షణం రిలీవ్ చేస్తూ సర్వీస్ రిజిష్టర్‌ను అమరావతిలోని జీఏడీకి అందజేయాలని తెలంగాణను ఏపీ ప్రభుత్వం కోరింది.