DailyDose

గుంటూరు రూరల్‌లో ఇద్దరు సీఐలపై వేటు-నేరవార్తలు

గుంటూరు రూరల్‌లో ఇద్దరు సీఐలపై వేటు-నేరవార్తలు

* విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు గుంటూరు రురల్ పోలీస్ జిల్లాలోని చిలకలూరిపేట అర్బన్ సీఐ బిలాలుద్దీన్ , రేపల్లె రూరల్ సీఐ శ్రీనివాసరావులను విఆర్‌కు పంపుతూ డిఐజి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల చిలకలూరిపేట పట్టణ పరిధిలో, రేపల్లె రూరల్ పరిధిలో పెద్దఎత్తున పేకాట శిబిరాలు నిర్వహణ విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ రెండు చోట్ల, సిఐల పర్యవేక్షణ కొరవడటంతోనే పేకాట శిబిరాలు నిర్వహించినట్లు అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సీఐలను విఆర్‌కు పంపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే గతంలో చిలకలూరిపేట అర్బన్ సీఐగా పనిచేసిన వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలలోపే విఆర్ కు వెళ్లారు. గత ఏడాది డిసెంబరు 8న బాధ్యతలు చేపట్టిన బిలాలుద్దీన్‌ను కూడా ఏడాది గడవకముందే విఆర్‌కు పంపించడం గమనార్హం. మూడు జిల్లాలలో పోలీస్ అధికారులపై నిరంతరం డిఐజి నిఘా ఉంచుతున్నారన్న మాట ఈరోజు బదిలీ వేటు పడ్డ ఇరువురు సిఐల ఘటనతో నిరూపణ అయ్యిఒది.

* మధ్యప్రదేశ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. విదిశలోని గంజ్‌బసోడ గ్రామంలో ఓ బాలికను కాపాడబోయిన 15 మంది గ్రామస్థులు బావిలో పడిపోయారు.

* బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ధార్మిక పరిషత్‌ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు తెలిపింది. టీటీడీ ఈవో సంతకం లేదు కాబట్టి తీర్మానం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

* ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపై లోక్‌సభ సచివాలయం గురువారం నోటీసులు జారీ చేసింది.

* కైకలూరు మండలం కొల్లేటి లంక గ్రామం అయిన పందిరిపల్లిగూడెం గ్రామంలొ 280 ఎకరాల చెరువు పై నాటుసారా తయారుచేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 600లీ సారా, తయారీ సామాగ్రి స్వాధీనపరుచుకుని ప్రోబిషన్ అమెండమెంట్ యాక్ట్ 2020 కేసు నమోదు చేసిన కైకలూరు రూరల్ పోలీసులు.

* దిశా యాప్ ద్వారా సహాయం కోరిన మహిళ…సత్వరమే స్పందించి సహాయం అందించిన నరసరావుపేట 2 టౌన్ సీఐ వెంకట్రావు. సీఐ గారి స్పందనకు మెచ్చి,అభినందించిన గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఐపీఎస్ ., సీఐ మరియు సిబ్బందికి రివార్డులు ప్రకటన. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీ నుండి షేక్ రేష్మా అనే మహిళను తన భర్త విపరీతంగా కొడుతున్నాడని, తనను తక్షణమే కాపాడాలని దిశా యాప్ ద్వారా పోలీసుల సహాయం కోరిన మహిళ. కేవలం 5 నిముషాలలో ఘటనా స్థలానికి చేరుకుని, భర్త చేతిలో గాయపడిన మహిళను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి, ఆమెకు ధైర్యం చెప్పి, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరిన సీఐ. వైద్య ఖర్చులు నిమిత్తం బాధితురాలికి నగదు అందజేత. ప్రతి మహిళ తమ మొబైల్ లో దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఆపదలో ఉన్న సమయంలో తమకు సమాచారమిస్తే వీలైనంత త్వరగా బాధిత మహిళను కాపాడతామని వెల్లడించిన సీఐ వెంకట్రావు.