DailyDose

మామిడితోటలో గంధపు చెక్కల స్మగ్లింగ్-నేరవార్తలు

మామిడితోటలో గంధపు చెక్కల స్మగ్లింగ్-నేరవార్తలు

* కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 103 పశువులను పట్టివేత.ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు పశువులను రెండు వాహనాలలో అక్రమంగా తరలిస్తుండగా రామాపురం చెక్ పోస్ట్ వద్ద కోదాడ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* ఆనందయ్య మందుపై దాఖలైన ఓ పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.కోర్టును అపహాస్యం చేయొద్దంటూ పిటిషనర్‌ తరపు న్యాయవాదిని హెచ్చరించింది.నెల్లూరు జిల్లాలో ఆనందయ్య మందు కరోనాకు అద్భుతంగా పనిచేస్తోందని, దాని పంపిణీని పునఃప్రారంభించాలంటూ లా విద్యార్థి అభినందన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఏఎస్‌.బోపన్న, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ చేపట్టింది.విచారణ ఆరంభం కాగానే మీకేం కావాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రశ్నించారు.తాము పిటిషన్‌ వేసి చాలా రోజులైందని సాంకేతికంగా పిటిషన్‌ విచారణ అవసరం లేదని న్యాయవాది సమాధానమిచ్చారు.హైకోర్టుకు వెళ్లాలని బదులిచ్చిన ధర్మాసనం ఇలాంటి కేసులతో కోర్టును అపహాస్యం చేయొద్దని హెచ్చరించింది.పిటిషన్‌ ఉపసంహరణకు అభ్యర్ధించగా అందుకు అంగీకరించని ధర్మాసనం, కేసును కొట్టేస్తున్నట్లు తెలిపింది.

* ఏఎం పురంలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం .నిందితుడు ఒకరిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు .చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం అలివేలుమంగాపురం గ్రామంలో ఓ మామిడి తోటలో అక్రమంగా దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను స్థానిక ఫారెస్ట్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు .ఇందుకు సంబంధించి అలివేలుమంగాపురం గ్రామానికి సంబంధించిన సుబ్రహ్మణ్యం రెడ్డి కుమారుడు నిందితుడు గోపిరెడ్డిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు .అలివేలుమంగాపురం గ్రామంలో అటవీ ఫారెస్ట్ రేంజ్ పరిధికి పక్కనే ఉన్న మామిడి తోటలో ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం గాలింపు చేపట్టారు .ఈ నేపథ్యంలోనే మామిడి తోటలో పది ఎర్రచందనం దుంగలు బట్టబయలయ్యాయి .

* సింహాచలం భూముల అక్రమాల ఆరోపణల్లో స్పష్టత లేదని మాజీ కేంద్ర మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.!700 ఎకరాలు అన్యాక్రాంతం అంటే చిన్న విషయం కాదన్నారు.

* ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి మాయమాటలు చెప్పి తన కూతురిని (మైనర్‌) తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతుడికి (35) భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన వ్యవసాయం చేస్తుండగా, భార్య కుట్టుమిషన్‌ కుడుతూ కుటుంబానికి చేదోడుగా ఉంటోంది. ఆన్‌లైన్‌ తరగతుల కోసమని సెల్‌ ఫోన్‌ ఇవ్వగా ఫేస్‌బుక్‌లో ఖాతా సృష్టించుకున్న కూతురు.. మిత్రులతో చాటింగ్‌ చేసేది. ఈ క్రమంలో పరిచయమైన వ్యక్తితో జూన్‌ 7న వెళ్లిపోయింది.