Videos

అష్టావధానంలో పృచ్ఛకుడిగా జస్టిస్ ఎన్.వి.రమణ-తాజావార్తలు

అష్టావధానంలో పృచ్ఛకుడిగా జస్టిస్ ఎన్.వి.రమణ-తాజావార్తలు

* జ్ఞాపక శక్తి, అపార మేధస్సు, భాష మీద పట్టు మేళవింపే అష్టావధానం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తిరుపతి నుంచి ఆన్‌లైన్‌లో జరిగిన చతుర్గుణిత అష్టావధానంలో జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అవధాని మేడసాని మోహన్‌ ఆధ్వర్యంలో చతుర్గుణిత అష్టావధానం నిర్వహించారు. తొలి ప్రశ్న వేసి అష్టావధానాన్ని సీజేఐ ప్రారంభించారు. జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘అష్టావధాన ప్రక్రియ తెలుగు భాషకు ఎంతో ప్రత్యేకం. శతాబ్దాల సాహితీ తపస్సు నుంచి అవధానం ఉద్భవించింది. మాతృ భాష, జాతి ఔన్నత్యానికి అష్టావధానం ప్రతీక. తెలుగువాడు భాషాభిమాని తప్ప దురభిమాని కాదు. మధురమైన తెలుగుభాషను భావితరాలకు అందించాలి. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం జీవన గమనాన్ని మారుస్తోంది. తెలుగు భాషకు ఆదరణ తగ్గించేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాహితీ ప్రక్రియను జనరంజకంగా తీర్చిదిద్దాలి. సాహిత్య రూపం కనుమరుగైతే తిరిగి సృష్టించలేం. సాహితీ ప్రక్రియ ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టేలా మార్పు చేసుకోవాలి. సాహితీ సేవలో నా వంతు కృషి చేసేందుకు ఎప్పుడూ ముందుంటాను’’ అని ఎన్వీ రమణ వివరించారు.

* సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత చుట్టు పక్కల కాలనీల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలకు ఇబ్బంది మారిన కంటోన్మెంట్ రహదారుల మూసివేత సమస్యను పరిశీలించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ కు సూచించారు.నూతనంగా సహాయమంత్రిగా నియమితులైన శ్రీ అజయ్ భట్, ఆదివారం నాడు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో, వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యను ప్రస్తావించిన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఈ సమస్య కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని, సమస్యను పరిష్కరించాలని సహాయమంత్రికి సూచించారు.ఈ సమస్యకు సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర రక్షణమంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ కు రాసిన లేఖ గురించి కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి, తెలియజేస్తామని శ్రీ అజయ్ భట్ ఉపరాష్ట్రపతికి తెలిపారు.

* తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జ‌రుగ‌నున్నాయి.

* గుంటూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన నగర కమిషనర్ శ్రీమతి చల్లా అనురాధ.

* పరిపాలించే స్థానాల్లో సొంత వారు.. పరిపాలించబడే స్థానాల్లో బడుగులా? అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

* మూడు రాజధానులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.

* రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

* మిజోరాం కి బయలుదేరిన కంభంపాటి హరిబాబు.విశాఖ బిజెపి మాజీ ఎంపీ కుటుంబ సమేతంగా ఈరోజు ఉదయం విశాఖ విమానాశ్రయం నుండి కలకత్తా బయలుదేరి వెళ్లారు.

* ప్రజావేదిక కూల్చివేతతో ఏం సాధించారని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు.

* తెలంగాణకు నష్టం కలిగించే అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల గురించి సభలో ప్రస్తావిస్తామన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇంకా పరిష్కారం కాని అంశాలు చాలా ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని సమావేశంలో కోరామని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరామన్నారు. దేశ సమస్యలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని తెలిపామని నామా నాగేశ్వరావు వెల్లడించారు.

* ఉప ఎన్నికలు వస్తేనే ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తోందని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఈటల మాట్లాడారు. ఉప ఎన్నిక రాగానే కుల సంఘాల భవనాలు మంజూరయ్యాయని గుర్తు చేశారు. ఇతర పార్టీల నేతలను కలిస్తేనే తప్పుగా భావించే రోజులు వచ్చాయన్నారు. తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 2018 ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు కుట్ర చేశారని తెలిపారు. తెరాస నేతలు తన ప్రత్యర్థికి డబ్బులు పంపించారని పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవ్గంలో మంత్రి హరీశ్‌రావు చేసిన విధంగానే తను కూడా హుజూరాబాద్‌లో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు ఈటల చెప్పారు.