Fashion

ఐసు గడ్డలతో స్నానం

ఐసు గడ్డలతో స్నానం

రెండు ఐసు ముక్కల్ని చేతిలో పెట్టుకుని నాలుగు నిమిషాలు ఉండాలంటేనే ‘బాబోయ్‌’ అనేస్తాం. కానీ ఈమధ్య యూఏఈ వాసులు అక్కడి ఎండలను తట్టుకోవడానికి ఐస్‌ క్యూబులు నింపిన బాత్‌టబ్బుల్లో కూర్చుంటున్నారట. అదీ ఎడారిలో ఆరుబయట. ఐస్‌ బాత్‌ థెరపీగా పిలిచే దీనివల్ల శరీరం చల్లబడటంతో పాటు, మెదడు కూడా చురుకవుతుందట. అంతేకాదు, ఒకేసారి బాగా వేడి, బాగా చల్లదనం శరీరానికి తగలడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందన్నది ఈ ఐస్‌బాత్‌ నిర్వాహకుల మాట. ‘ఐసు టబ్బులో కూర్చున్న వెంటనే ఊపిరి ఆడనట్లుండి, బయటికి వచ్చేయాలని పిస్తుంది కానీ తర్వాత హాయిగా ఉంటుంది’ అంటున్నారు జనం. ఎడారిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, కూర్చోగలుగుతున్నారేమో కానీ మన దగ్గరైతే గడ్డకట్టేయడం ఖాయం… ఏమంటారు..?