Kids

విద్యార్థులను విభజిస్తాం…ఆదిమూలపు-తాజావార్తలు

విద్యార్థులను విభజిస్తాం…ఆదిమూలపు-తాజావార్తలు

* అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఈ భేటీ బుధవారం జరగనుంది.

* జేఈఈ మెయిన్‌ మూడో విడత పరీక్షకు సర్వం సిద్ధమయ్యింది.కరోనా కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది.ఈ పరీక్షను జూలై 20, 22, 25, 27 తేదీల్లో నిర్వహించనున్నారు.పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 7,09,519 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీనిని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నది.మూడో విడత పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

* ఆగస్టులో పాఠశాలలను తిరిగి తెరిచే ప్రణాళికలను రూపొందిస్తున్నాం…తరగతులను ఎలా ప్రారంభించాలో కోవిడ్-19 మూడవ వేవ్‌పై ఆధారపడి ఉంటుంది..విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా చేసి, 50శాతం హాజరుతో పాఠశాలలను తెరవడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది – మంత్రి ఆదిమూలపు.

* వైసీపీ ఎంపీ రఘురామకృష్ణఒరాజును కస్టడీకి తీసుకుని ధర్డ్ డిగ్రీ ప్రయోగిఒచటాన్ని ప్రశ్నిస్తూ హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేసినందుకు వైసీపీ నాయకులు హత్య చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్న నూజివీడుకు చెందిన యువకుడు మణి రత్నం

* ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీ వి.విజయసాయి రెడ్డి ఈరోజు రాజ్యసభలో వెల్‌లోకి దూసుకెళ్ళారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని ఆమోదిస్తూ మార్చి 11, 2014న కేంద్ర మంత్రివర్గం చేసిన తీర్మానం ఏడేళ్ళు కావస్తున్నా అమలుకు నోచుకోనందున ఈ రోజు రాజ్యసభలో ఇతర కార్యకలాపాలను సస్పెండ్‌ చేసి ప్రత్యేక హోదా అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు రూల్‌ 267 కింద విజయసాయి రెడ్డి నోటీసును అందించారు. అయితే ఈ నోటీసుపై ఇప్పటికిప్పుడు చర్చకు అనుమతించేందుకు నిరాకరిస్తున్నట్లుగా సభాధ్యక్షులు ప్రకటించడంతో విజయసాయి రెడ్డి సభలోని వెల్‌లోకి దూసుకువెళ్ళారు. ఆయనతోపాటు వివిధ అంశాలపై చర్చకు పట్టుబట్టిన ఇతర పార్టీ సభ్యులు సైతం వెల్‌లోకి చేరుకని నినాదాలు చేశారు. దీంతో అధ్యక్షులు విజయసాయి రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ మీ నోటీసులో ప్రస్తావించిన ప్రత్యేక హోదా అంశం చర్చకు అర్హమైనదే. కానీ ఈ రోజు చర్చకు అనుమతించలేనని తెలిపారు. సభలో విజయసాయి రెడ్డితోపాటు ఇతర పార్టీ సభ్యులు వెల్‌లో ఆందోళన చేస్తున్న సమయంలో సభలో ఉన్న ప్రధానమంత్రి మౌనంగా వారిని వీక్షిస్తూ కనిపించారు

* జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన నెలసరి వేతనాన్ని రూ.15వేల నుంచి రూ.28,719కి పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు ప్రొబేషన్‌ కాలాన్ని మూడు నుంచి నాలుగేళ్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

* రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేశారు. ఇంకా ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ.. ప్రభుత్వానికి లేఖ రాశారు. దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ ప్రభుత్వ సర్వీసు నుంచి వీఆర్‌ఎస్‌ తీసుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు. ఓ పోలీసు అధికారిగా సేవలు అందించి ప్రవీణ్‌కుమార్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. పేదలకు నాణ్యమైన చదువు అందాలని భావించి, సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా భావించి ఆయన్ను ప్రోత్సహించడంతో..సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సమూల మార్పులు చేశారు.

* దేశంలో తీవ్ర దుమారం రేపుతున్న హ్యాకింగ్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘పెగాసస్‌’ లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో కీలక నేతలు, ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, మాజీ సీఈసీ అశోక్‌ లావాసా ఫోన్‌ నంబర్లు హ్యాకింగ్‌ టార్గెట్‌ జాబితాలోఉన్నట్టు ‘ది వైర్’ తాజాగా మరో కథనం వెల్లడించింది.

* యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్‌ వద్ద విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కరోనా టీకా కోసం వెళుతున్న యాదమ్మ(70) అనే వృద్ధురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. వృద్ధురాలి మృతిని నిరసిస్తూ గ్రామస్థులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. అండర్‌పాస్‌ బ్రిడ్జి లేని కారణంగా ప్రమాదం జరిగినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్ అమరావతిపై దుష్ప్రచారం మానుకుని ప్రజా రాజధాని నిర్మాణానికి సహకరించాలని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హితవు పలికారు. అమరావతి భూముల వ్యవహారంలో ఎలాంటి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ లేదని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు. సుప్రీం తీర్పుతో రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని స్పష్టమైందన్నారు. రాజధాని విషయంలో సీఎం తన తీరు మార్చుకోకపోతే.. మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎలాంటి ఖర్చూ లేకుండా అమరావతి నుంచి పాలన కొనసాగించే అవకాశం ఉన్నా, 3 రాజధానుల నిర్ణయంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణానికి సహకరిస్తానని ప్రతిపక్షంలో ఉండగా ప్రకటించిన జగన్… అధికారంలోకి రాగానే మాటెందుకు మార్చారని నిలదీశారు. అమరావతి అభివృద్ధితోనే 13 జిల్లాల అభివృద్ధి, యువతకు ఉపాధి, సంపద సృష్టి సాధ్యమని ఇకనైనా గుర్తించాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.