NRI-NRT

Telangana NRI Reddies (USA) డాలస్ విభాగం ప్రారంభం

Telangana NRI Reddies USA - Dallas Chapter Started

తెలంగాణ ఎన్నారై రెడ్డీస్ (USA) డాలస్ చాప్టర్ ప్రారంభోత్సవ వేడుక డాలస్ నగరంలోని పైలట్ నాల్ పార్క్ లో శనివారం మధ్యాహ్నం ఘనంగా జరిగింది. డాలస్ ప్రాంతంలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రవాసులతో పాటు అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ సామాజిక వర్గ ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాజకీయ ఉద్యేశంతో కాకుండా, “కనెక్టింగ్ ది కమ్యూనిటీ” అనే సంకల్పంతో ఈ సంస్థను స్థాపించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రవాస యువతీయువకుల వివాహ పరిచయ వేదికగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన పేద రెడ్డి సామాజిక వర్గీయులకు తోడ్పడటానికి దీన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.

మహిళలు, పిల్లలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనంలో తెలంగాణ ప్రాంత వంటకాల్ని అతిథులు ఆస్వాదించారు. జాతీయ స్థాయి సంస్థగా ప్రారంభించబడిన తెలంగాణ ఎన్నారై రెడ్డీస్ (USA) త్వరలో అమెరికాలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని రఘువీర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి బొర్రా, శ్రీనివాస్ రెడ్డి కేలం, చంద్ర రెడ్డి పోలీస్, సురేష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి ఎక్కటి, అనిల్ రెడ్డి బొడ్డు తదితరులు పర్యవేక్షించారు.

Telangana NRI Reddies USA - Dallas Chapter Started
Telangana NRI Reddies USA - Dallas Chapter Started
Telangana NRI Reddies USA - Dallas Chapter Started