WorldWonders

తమిళనాడులో 5పైసల బిర్యానీకి ఎగబడ్డ జనం

తమిళనాడులో 5పైసల బిర్యానీకి ఎగబడ్డ జనం

బిర్యానీ సెంటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా వినూత్న ఆఫర్‌ పెట్టడంతో ప్రజలు ఆ స్టాల్‌ ముందు క్యూ కట్టారు. కొవిడ్‌ నిబంధనలను ఖాతరు చేయకుండా బిర్యానీ కోసం ఎగబడ్డారు. తమిళనాడులోని మదురైకి చెందిన ఓ వ్యాపారి నూతనంగా ఓ బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించారు. దాని ప్రమోషన్‌లో భాగంగా.. ఎవరైతే 5 పైసల నాణెం (ప్రస్తుతం వాడకంలో లేదు) తీసుకొస్తారో వారికి బిర్యానీ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. కాగా ఈ ప్రకటనకు ఊహించని స్పందన లభించింది. దాదాపు 300 మంది 5 పైసలతో బిర్యానీ సెంటర్‌ ముందు క్యూ కట్టారు. అందులో చాలా మంది మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం నిబంధనను లెక్కచేయకుండా ఒకరిమీద ఒకరు పడ్డారు. ఈ ఊహించని పరిణామాలతో కంగుతిన్న ఆ షాపు యజమాని షటర్‌ను మూసేయాల్సి వచ్చింది. ప్రజలు గుమిగూడటంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గుమిగూడిన వారిని చెదరగొట్టారు. ఆఫర్‌ ప్రకటించడంతో 5 పైసల కోసం ఇల్లు మొత్తం వెతికామని.. కష్టపడి వాటిని తీసుకొస్తే చివరకు దుకాణాన్ని మూసేశారని కొందరు వాపోవడం గమనార్హం.