Politics

తెరాస ఎంపీకి 6నెలల జైలు-నేరవార్తలు

తెరాస ఎంపీకి 6నెలల జైలు-నేరవార్తలు

* తెరాస ఎంపీకి 6 నెలల జైలు శిక్ష.మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు 6 నెలల జైలు శిక్ష.ఎంపీ కవితకు 6 నెలల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించిన ప్రజా ప్రతినిధుల కోర్టు.పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో తీర్పు.మాలోత్ కవితపై 2019లో బూర్గంపహాడ్ పీఎస్‌లో కేసు నమోదు.రూ.10వేల జరిమానా చెల్లించిన ఎంపీ మాలోత్ కవిత.మాలోత్ కవితకు బెయిల్ మంజూరు చేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు.

* మాన్సాస్ ట్రస్ట్ ఈవోపై హైకోర్టులో అశోక్​ గజపతిరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. ట్రస్ట్ ఈవో వెంకటేశ్వరరావు సహకరించడం లేదని పేర్కొన్నారు.

* ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై చర్యలకు ఆదేశించిన హైకోర్టు.ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై చర్యలకు  హైకోర్టు ఆదేశించింది.సత్యనారాయణపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.సత్యనారాయణను అదుపులోకి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని హైకోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది.కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు  హైకోర్టు ఆదేశించింది.ఆదేశాలు అమలుచేసినప్పటికీ గత వాయిదాకు సత్యనారాయణ ఆలస్యంగా హాజరయ్యారు.కేసు విచారణలో సత్యనారాయణ కోర్టుకు ఆలస్యంగా వచ్చారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా ఉంటుందని న్యాయమూర్తి వెల్లడించారు.రూ.50 వేలు జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని తెలిపారు.

* నాటు బాంబులు తీసుకు వెళుతున్న వ్యక్తి అరెస్ట్.చిత్తురు జిల్లా వెదురుకుప్పం మండలంలో నాటు బాంబుల కలకలం.నాటు బాంబులు సంచిలో వేసుకుని తీసుకు వెళుతున్న దొరస్వామి(37) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..నాటు బాంబులపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు…అడవి జంతువుల వేట కోసం నాటు బాంబులు ఉపయోగిస్తున్నట్లు పోలీసుల అనుమానం….దొరస్వామి వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయితీ మహేశ్వరం ఎస్టీ కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తింపు..మరో ఇద్దరు పరార్..తిరుపతి -కొత్తపల్లిమిట్ట రోడ్డు గొడుగు చింత వద్ద 20 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.