Politics

పప్పుకు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్

కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తన ట్విట్టర్ వేదికగా చెబుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య అంటూ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ థాంక్స్ పప్పు అంటూ ధన్యవాదాలు చెప్పారు. కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సందర్భంగా కేటీఆర్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. మరోవైపు టాలీవుడ్‌ సెలబ్రిటీలైన అల్లు శీరిష్‌, తమన్‌, బండ్ల గణేష్, అనసూయ, ఈషారెబ్బా, సుధీర్‌ బాబు, ప్రదీప్‌ మాచిరాజు, అడవి శేషుతో పాటు పలువురు కేటీఆర్‌కు విషెస్‌ తెలిపారు.