NRI-NRT

బెహ్రెయిన్‌లో ఎన్నారై తెరాస ముక్కోటి వృక్షార్చన

KTR Birthday In Bahrain By NRI TRS

తెలంగాణా మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బెహ్రెయిన్ ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బొలిసెట్టి, జనరల్ సెక్రటరీ పుప్పాల బద్రి తదితరులు స్థానికంగా మొక్కలు నాటారు. కేటీఆర్ టీఅర్ఎస్ పార్టీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని, బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.