Business

4వేల కోట్ల నష్టంలో టాటా మోటర్స్-వాణిజ్యం

4వేల కోట్ల నష్టంలో టాటా మోటర్స్-వాణిజ్యం

* కొవిడ్‌-19 రెండోదశ తగ్గుతుండటంతో.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ నియామకాల సందడి మొదలైంది. నియామకాలపై ఈ ఏడాది మొదట్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల్లో కొంత సందిగ్ధత నెలకొన్నా.. ఇప్పుడు ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. విప్రో సంస్థ గతంలో పరీక్ష రాసి, అర్హత సాధించిన వారిని ఇప్పుడు మౌఖిక పరీక్షలకు పిలిచింది. మానవవనరుల అవసరాలు పెరగడంతో గతంలో పరీక్షలో ప్రతిభ చూపిన వారిని ఇంటర్వ్యూలకు పిలిచింది. టీసీఎస్‌ రెండో జాబితాను విడుదల చేసి, ఇంటర్వ్యూలు పూర్తి చేసింది. సంస్థలకు ప్రాజెక్టులు పెరుగుతుండటంతో ఫ్రెషర్ల నియామకాలకు ప్రకటనలు ఇస్తున్నాయి. టీసీఎస్‌ నింజా ప్రకటన విడుదల చేసింది. దీంతో కళాశాలలు విద్యార్థుల సన్నద్ధతపై దృష్టిసారించాయి. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలపై శిక్షణ ఇస్తున్నాయి.

* ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కంపెనీ రూ.4,450.92 కోట్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.8,437.99 కోట్లుగా ఉన్నది. అంటే సంస్థ నష్టం 47 శాతం మేర తగ్గిందన్నమాట. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ ప్రకారం, కంపెనీ ఆదాయం సంవత్సరానికి 107.6 శాతం పెరిగి రూ.66,406.05 కోట్లకు చేరుకున్నది. ఏడాది క్రితం ఇది రూ.31,983.06 కోట్లు. కన్సాలిడేటెడ్ ఈబీఐటీడీఏ మార్జిన్ కూడా 8.3 శాతం వద్ద ఉన్నది.

* క‌రోనా మ‌హ‌మ్మారి ఉధ్రుతి.. చార్ట‌ర్డ్ జెట్ విమానాల య‌జ‌మానుల‌కు ట్రావెల‌ర్స్ లాభాలు తెచ్చి పెట్టారు.. అవును ఇది నిజం.. హాలీడే ట్రిప్‌, బిజినెస్ ప‌నుల‌పై వెళ్లే వారు ఒక సిటీ నుంచి మ‌రో సిటీకి ప్ర‌యాణించ‌డానికి ప్రైవేట్ చార్ట‌ర్డ్ జెట్ విమానం హైర్ చేసుకోవ‌డానికి రూ.3.5 ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేయ‌డానికి వెనక్కి త‌గ్గ‌లేదు.

* ప్రపంచంలోని రెండు ప్రసిద్ధ ఆటోమొబైల్ కంపెనీలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. ఈ రెండు కంపెనీలు ఒక సాంకేతిక పరిజ్ఞానం కోసం కేసులు పెట్టుకుంటున్నాయి. తన కో పైలట్‌ 360 ఆటోమేటిక్ డ్రైవింగ్‌ సిస్టంకు ‘బ్లూ క్రూయిస్’ అని పేరు పెట్టడంపై ఫోర్డ్ మోటార్‌ కంపెనీపై జనరల్ మోటార్స్ కేసు నమోదు చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో.. కంపెనీ కాలిఫోర్నియా జిల్లా కోర్టుకు విన్నవించింది. అయితే దీనిపై ఇంతవరకు ఫోర్డ్ సంస్థ ఎలాంటి స్పందన తెలుపలేకపోవడం విశేషం.

* గొప్ప ఆవిష్కరణలు, అంకితభావానికి ప్రసిద్ది అని జపాన్‌ మరోసారి రుజువు చేసింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి అద్భుతమైన ఒలింపిక్స్‌ పతకాలను సిద్ధం చేసి ప్రపంచానికి పర్యావరణ సమస్యలను గుర్తుచేసింది. దేశవ్యాప్తంగా చెడిపోయిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించి అందమైన ఒలింపిక్‌ పతకాలుగా మలిచి ఔరా! అనేలా చేసింది. దేశ ప్రజలను భాగస్వాములుగా చేసి ఒలింపిక్స్ కోసం 5,000 బంగారు, వెండి, కాంస్య పతకాల తయారీకి కావాల్సిన ఎలక్ట్రానిక్స్‌ వేస్టేజ్‌ను సేకరించింది. రెండేండ్ల క్రితం నుంచి దేశవ్యాప్త ఉద్యమం చేపట్టి మెడల్స్‌ తయారయ్యేలా చేయడంలో జపాన్‌ ప్రభుత్వం విజయం సాధించింది.