Politics

రాజమండ్రి జైలుకు ఉమా. 14రోజుల రిమాండ్-నేరవార్తలు

రాజమండ్రి జైలుకు ఉమా. 14రోజుల రిమాండ్-నేరవార్తలు

* కృష్ణా జిల్లా నందివాడ పోలీస్‌ స్టేషన్‌ నుంచి భారీ భద్రత మధ్య మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును హనుమాన్‌ జంక్షన్‌ తరలించారు. హనుమాన్‌ జంక్షన్‌ సీఐ ఆఫీసులో జూమ్‌ యాప్‌ ద్వారా వర్చువల్‌గా మైలవరం కోర్టు జడ్జి ఎదుట ఉమాను హాజరుపర్చారు. దేవినేని ఉమాకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని ఆదేశించారు. ఉమాను అరెస్టు చేసిన తర్వాత ఉదయం 6గంటలకు నందివాడ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటినుంచి నందివాడలో హై అలర్ట్‌ ప్రకటించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దేవినేని ఉమాతో స్టేషన్‌ నుంచి బయలుదేరిన పోలీస్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు తెదేపా శ్రేణులు అడుగడుగునా ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. భారీ బందోబస్తు మధ్య దేవినేని ఉమాను కోర్టుకు తరలించారు

* తుని పట్టణం సంతోషిమాత జ్యువెలరీ షాపు చోరీ కేసును ఛేదించిన తుని పోలీసులు.అదే షాపు పనిచేస్తున్న గుమస్తా లావేటి శ్రీను అరెస్టు.చోరీ సొత్తు రూ.10 లక్షల నగదు,రెండు లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం, నిందితుడు కోర్టుకి తరలింపు.

* బస్సు ట్రక్కు ఢీ- 18 మంది మృతి.ఉత్తర్​ప్రదేశ్​లో ఓ డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 18 మంది మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.వెనక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది.బారాబంకి జిల్లా రామ్​స్నేహిఘాట్​ ప్రాంతంలోని లఖ్​నవూ-అయోధ్య జాతీయ రహదారిపై అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.బస్సు హరియాణా నుంచి బిహార్​కు వెళ్తోందని చెప్పారు. క్షతగాత్రులను లఖ్​నవూ ట్రామా సెంటర్​కు తరలించారు.

* ఎస్పీ సిద్ధార్ధ కౌశల్..దేవినేని ఉమ ను అరెస్ట్ చేశాం మా కస్టడీ లోనే ఉన్నారు.శాంతి భద్రతల కు విఘాతం కలించారు.100% ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.దేవినేని ఉమ పై కంప్లైంట్ ఆధరంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాం.డీఐజీ మోహనరావు….దేవినేని ఉమ ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతో జి.కొండూరులో అలజడి‌ సృష్టించారు.ఊదేశపూర్వకగానే దేవినేని ఉమ వివాదం సృష్టించారు.ముందోస్తు పథకం లో భాగంగా దుర్దేశం పూర్వకంగా ఉమ కొండపల్లి నుంచి తన అనుచరులతో వెళ్లారు.ఈరోజు జరిగిన పూర్తి ఆలజడికి దేవినేని ఉమ కారణం.వైకాపా కార్యకర్తల ను రెచ్చ కొటే విధంగా ఉమ వ్యహరించారు.

* నందివాడ పోలీస్స్టేషన్లో తెదేపా నేత దేవినేని ఉమ.దేవినేని ఉమా పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.దేవినేని పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, 307 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన జి.కొండూరు.పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.దేవినేని ఉమా హత్యాయత్నానికి పాల్పడినట్టు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.దేవినేని తో పాటు మొత్తం 18 మంది తెలుగుదేశం పార్టీ వర్గీయుల పై కేసు నమోదు చేసిన పోలీసులు.జి కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి అరెస్టు.