DailyDose

జిల్లా జడ్జి హత్య?-నేరవార్తలు

జిల్లా జడ్జి హత్య?-నేరవార్తలు

* ప.గో.: దేవరపల్లి మండలం బందపురం సమీపంలోని నూతన జాతీయ రహదారిపై ఈ రోజు నిమ్మకాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది.

* నూజివీడు తహశీల్దార్ కార్యాలయం పై ఎ.సి.బి. అధికారులు దాడులు. టేకుచెట్లు నరికివేసేందుకు మైలవరం గ్రామానికి చెందిన జన్నవరపు జగన్నాథరెడ్డి అనే రైతు నుండి రూ.34 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎ. ఆర్.ఐ. అనిల్.

* తాడేపల్లిలో ఓ నివాసంలో గుర్తు తెలియని రెండు మృతదహాలు. చనిపోయి వారం రోజులు అయివుండొచ్చని అనుమానం.

* జడ్జిని ఆటోతో ఢీకొట్టి హత్య.ఝార్ఖండ్​, ధన్​బాద్​ జిల్లా జడ్జి ఉత్తమ్​ ఆనంద్​ మృతి కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.మొదట హిట్​ అండ్​ రన్​ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు చివరకు ఇది పథకం ప్రకారం చేసిన హత్య అని ప్రాథమికంగా తేల్చారు.జిల్లా జడ్జి ఉత్తమ్​ ఆనంద్​ బుధవారం తెల్లవారుజామున జాగింగ్​ చేస్తుండగా ఓ ఆటో వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో జడ్జి అక్కడికక్కడే మృతి చెందారు.మొదట హిట్​ అండ్​ రన్​ కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.కానీ సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాక కావాలనే ఆనంద్​ను కావాలనే హత్యచేశారని నిర్ధరణకు వచ్చారు. ఆనంద్​ను ఢీకొట్టిన ఆటోడ్రైవర్​ను అరెస్ట్​ చేశారు.ఈ కేసును సుప్రీంకోర్టులో ప్రస్తావించారు సుప్రీం లాయర్​ వికాస్ సింగ్​. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

* వైఎస్ వివేకా హత్యకేసులో 53వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది.

* అనంతపురం జిల్లాలో బెంగళూరు, రాయలసీమ హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ నెలకొంది.జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో హిజ్రాలు రహస్యంగా సమావేశమయ్యారు.రాయలసీమ గ్రూప్‌కు చెందిన ఓ హిజ్రాను బెంగళూరు గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.దీనికి ప్రతిగా బెంగళూరు గ్యాంగ్ నుంచి కూడా ఒకరిని రాయలసీమ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.ఈ క్రమంలో రాయలసీమ బ్యాచ్‌కు చెందిన ఒకరిపై దాడి చేసిన బెంగుళూరు గ్యాంగ్ వారి వద్ద నుంచి నగలు, డబ్బును లాక్కెళ్లారు.దీంతో ఈ వ్యవహారంపై కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసేందుకు రాయలసీమ హిజ్రాల గ్యాంగ్ సిద్ధమైంది.