Sports

ఒలంపిక్స్‌లో ఓడిన జకోవిచ్

ఒలంపిక్స్‌లో ఓడిన జకోవిచ్

గోల్డ్ మెడ‌ల్ ( Gold Medal ) ఫెవ‌రేట్‌.. సెర్బియా ఆట‌గాడు నోవాక్ జోకోవిచ్‌ ( Djokovic ).. టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) సెమీస్‌లో ఎలిమినేట‌య్యాడు. మెన్స్ సింగిల్స్ టెన్నిస్ టోర్నీలో.. అలెగ్జాండ‌ర్ జ్వెరేవ్ చేతిలో జోకోవిచ్ ఓట‌మిపాలయ్యాడు. 6-1, 3-6, 1-6 స్కోర్ తేడాతో జ్వెరేవ్ విజ‌యం సాధించాడు. తొలి సెట్‌ను ఈజీగానే నెగ్గిన జోకోవిచ్ ఆ త‌ర్వాత కీల‌క‌మైన రెండు సెట్ల‌ను కోల్పోయాడు. నాలుగ‌వ సీడ్ జ్వెరేవ్ ఫైన‌ల్లో క‌రేన్ క‌చ‌నోవ్‌తో త‌ల‌ప‌డ‌నున్నాడు. బ్రాంజ్ మెడ‌ల్ మ్యాచ్ కోసం ప‌బ్లో కారెనో బుస్టాతో జోకోవిచ్ పోటీప‌డ‌నున్నాడు.