DailyDose

మంగళగిరి పోలీసుల కర్కశత్వం-నేరవార్తలు

మంగళగిరి పోలీసుల కర్కశత్వం-నేరవార్తలు

* జైల్లో తన భర్త దేవినేని ఉమకు ప్రాణహాని ఉందని ఆయన భార్య అనుపమ గవర్నర్‌, హైకోర్టు సీజే, కేంద్ర, రాష్ట్ర హోంమంత్రులకు లేఖలు రాశారు. తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమపై రెండు సెక్షన్లలో జి.కొండూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌తోపాటు 307 కింద హత్యాయత్నం కేసులను పెట్టారు. పెదపారపూడి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి అక్కడ నుంచి నందివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మైలవరం కోర్టు జడ్జి ఎదుట జూమ్‌ ద్వారా హాజరుపరచగా.. ఉమకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

* తిరుపతి అర్బన్ జిల్లాలో అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల ముఠా అరెస్ట్. ఐదుగురు దొంగల అరెస్టు, 40 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. సుమారు వాటి విలువ 30 లక్షలు.

* పారిశుద్ధ్య కార్మికుల జీతాలు అడిగినందుకు కార్మికులను సిఐటియు నేతలు 30 మందిని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఇరుకు లాకప్ గదిలో నిర్బంధించిన మంగళగిరి పట్టణ పోలీసులు

* అసోం, మిజోరాం సరిహద్దుల్లో నెలకొన్న వివాదం ఘటనలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత విశ్వ శర్మపై మిజోరాం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అదేవిధంగా హిమాంత పాలనా యంత్రాంగంలోని ఆరుగురు ఉన్నతాధికారులతో పాటు 200 పోలీసుల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో జోడించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనబడిన వారిలో అసోం ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌, కాచార్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కూడా ఉన్నారు. అసోంలోని కచార్‌ సరిహద్దుల్లో ఉన్న మిజోరాంలోని కొలసిబ్‌ జిలాల్లలోని వైరంగ్టే పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, అసోం పోలీసులు సైతం రాష్ట్రానికి చెందిన ఎంపితో పాటు ప్రముఖులకు సమన్లు జారీ చేశారు. ఈ సమన్లు అందించేందుకు న్యూఢిల్లీలోని ఎంపి నివాసాలకు పోలీసులు వెళ్లారు.

* టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ. ముఖ్యమంత్రి జగన్, వైస్సార్సీపీ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే విషయం అందరికీ తెలిసిందేనని.గూగుల్ మ్యాప్స్ లో కూడా ఈ విషయం క్లియర్ గా కనిపిస్తుందని అన్నారు. కొండపల్లి బొమ్మలను తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారని మండిపడ్డారు.గ్రీన్ ట్రైబ్యునల్ కూడా అక్రమ మైనింగ్ జరుగుతోందని స్పష్టం చేసిందని చెప్పారు.