DailyDose

ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్‌వార్-నేరవార్తలు

ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్‌వార్-నేరవార్తలు

* ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని జూపూడి గ్రామ శివారు లో డాక్టర్ ఎన్టీటిపీస్ బూడిద కరకట్ట నుండి మురుగు నీరు వాటర్ పాల్స్ తరహాలో వస్తుంటుంది.. అయితే ఇటీవల కాలంలో అధిక సంఖ్య లో యువకులు అక్కడ కు చేరుకొని సరదాగా నీటిలో ఆడుతూ అదే వాటర్ ఫాల్స్ అన్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ క్రమంలో ఈరోజు స్నేహితుల దినోత్సవం కావడం.. అందులోనూ ఆదివారం కావడం తో అధిక సంఖ్య లో యువత ఆ ప్రాంతానికి చేరుకున్నారు.. అక్కడ ఏం జరిగింది ఏమో కానీ ఒక్క సారిగా ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణ నెలకొంది..దీంతో ఒకరి ఒకరు కర్రలతో , పిడి గుద్దుల తో దాడులు చేసుకున్నారు.. ఈ దాడుల లో ఒక యువకుడు గాయపడగా అతను విజయవాడ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటునట్లు తెలుస్తోంది.. గతం ఎన్నడూ లేని విధంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడం తో ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ ఘటన ను సీరియస్ గా తీసుకున్నారు… ఘర్షణ లో పాల్గొన్న యువకుల కోసం అన్వేషణ ప్రారంభించారు.

* తన భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ గురించి ఎట్టకేలకు బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి పెదవి విప్పారు. విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా వార్తలు సృష్టించవద్దని ఆమె అన్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకి పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్విటర్‌ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నిజమే!! గత కొన్నిరోజలుగా ప్రతి విషయంలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. రాజ్‌కుంద్రా అరెస్ట్‌ వ్యవహరంపై ఎన్నో పుకార్లు, మరెన్నో ఊహాగానాలు వస్తున్నాయి. మీడియాతోపాటు అయినవాళ్లు కూడా నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహరంపై ఇప్పటివరకూ నేను అస్సలు మాట్లాడలేదు. ప్రస్తుతం కేసు విచారణలో దశలో ఉన్న కారణంగా ఆ విషయంపై నేను మాట్లాడాలనుకోవడం లేదు. ముంబయి పోలీసులు, భారత న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అలాగే, దయచేసి నా గురించి అసత్య ప్రచారాలు చేయకండి. నా పేరుతో ఇష్టం వచ్చినట్లు కథనాలు సృష్టించకండి. అంతేకాకుండా, ఒక తల్లిగా నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అడుగుతున్నాను. అధికారికంగా పూర్తి సమాచారం లేకుండా కామెంట్లు చేయకండి’’ అని శిల్పాశెట్టి అన్నారు.

* పరువునష్టం దావా కేసుకు సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డికి ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు లీగల్‌ నోటీసులు పంపారు. ఆయనతోపాటు జగతి పబ్లికేషన్స్‌ ఎండీ సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి టీవీ ఈడీ వినయ్‌ మహేశ్వరి, సాక్షి పత్రిక ఎడిటర్‌ మురళి, ప్రింటర్‌-పబ్లిషర్‌ రామచంద్రమూర్తికి ఏబీ నోటీసులు ఇచ్చారు. వీరందరికీ జులై 19న పరువునష్టం దావా నోటీసులు పంపారు. ఎన్నికల్లో రూ.50 కోట్ల తరలింపునకు ఎస్కార్ట్‌ ఇచ్చారనే ఆరోపణపై ఏబీవీ ఈ దావా వేశారు. ఈ ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. లేదంటే రూ.కోటి పరువునష్టం దావా కేసు వేస్తానని నోటీసుల్లో పేర్కొన్నారు.

* క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండు జీవితాలని తిరిగిరాని లోకానికి తీసుకెళుతున్నాయి. దేశంలో మూడేళ్ల వ్యవధిలోనే 24వేల మంది టీనేజర్లు (14-18ఏళ్ల వయసు) ఆత్మహత్యకు పాల్పడినట్లు తాజా నివేదిక వెల్లడించింది. వీరిలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని కారణంతోనే దాదాపు 4వేల మంది ప్రాణాలు తీసుకున్నట్లు తెలిపింది. దేశంలో టీనేజర్ల ఆత్మహత్యలకు సంబంధించి పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో(NCRB) ఈ వివరాలు వెల్లడించింది.