Movies

పటాపంచలు చేసేశా

పటాపంచలు చేసేశా

సినిమా ఇండస్ట్రీ గురించి నాకెలాంటి నాలెడ్జ్‌ లేదు. మా ఇంట్లో వాళ్లకు అస్సలు తెలియదు. ఇండస్ట్రీలో పరిచయాలూ లేవు. కానీ, నటిని కావాలనే ఆకాంక్ష నన్ను నడిపించింది. నేను సినిమాల్లోకి వచ్చి ఆరేండ్లు అవుతున్నది. ఈ చిన్న ప్రయాణంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలు. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ‘ఈ అమ్మాయి ఏడాది కన్నా ఎక్కువ కాలం ఉండలేదు’ అన్న మాటలూ వినిపించాయి. వాటికి నేనేమీ స్పందించలేదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకొని సమాధానం ఇవ్వాలనుకున్నా. నాకు సరిపోయే పాత్రలను ఎంచుకున్నా. దక్షిణాది నాలుగు భాషల్లోనూ సినిమాలు చేశాను. ‘జెర్సీ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యా! ఆ సినిమా నాకు మంచిపేరు తెచ్చింది. జోడి, కృష్ణ అండ్‌ హిస్‌ లీలా సినిమాలు నన్ను తెలుగువారికి మరింత దగ్గర చేశాయి….అని చెప్పుకొచ్చింది శ్రద్ధా శ్రీనాథ్