Movies

డబ్బులే డబ్బులు

డబ్బులే డబ్బులు

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒక‌రిగా ఉన్న త‌మ‌న్నా అందివ‌స్తున్న అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటుంది. త‌మన్నా కేవలం కమర్షియల్ పాత్రలు మాత్రమే కాకుండా హీరోయిన్ గా తనకు గుర్తింపు తెచ్చి పెట్టే సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను చేయాలని ఆశ పడుతోంది. ముఖ్యంగా ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తో త‌న టాలెంట్ నిరూపించాల‌ని అనుకుంటుంది. ఒక‌వైపు హీరోయిన్‌గా, మ‌రో వైపు ఐటెం సాంగ్స్ చేస్తూనే వెబ్ సిరీస్‌ల‌కు సిద్ధం అవుతుంది. ఇంకో వైపు టీవీ షోస్‌కి హోస్ట్‌గా కూడా ఉంటుంది. ఇప్పటికే ఈమె రెండు వెబ్ సిరీస్ లు చేయ‌గా, అందులో ఒకటి తెలుగు లో మ‌రొక‌టి తమిళంలో విడుద‌లైంది. ఈ రెండు వెబ్ సిరీస్ లు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. ప్ర‌స్తుతం హిందీలో వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ప్రముఖ ఓటీటీ ఈ వెబ్ సిరీస్ పై ఇప్పటికే ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ లు పలువురు ఈ వెబ్ సిరీస్ లో భాగస్వామ్యం అవుతారని అంటున్నారు. ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు వెబ్ సిరీస్‌ల‌తో కాల్షీట్స్ అడ్జెస్ట్ చేస్తూ ఈమె చేస్తున్న సాహ‌సం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. త‌మ‌న్నాపై నెటిజ‌న్స్ కాక ప‌లువురు సెల‌బ్రిటీలు ప్ర‌శంసలు కురిపిస్తున్నారు.