NRI-NRT

ఉత్తర కాలిఫోర్నియాలో దావానలం

Huge fire eating up villages around northern california 2021

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. దావానలం బీభత్సానికి గ్రీన్​విల్లే విలవిల్లాడుతోంది.

గ్రీన్​విల్లే ప్రాంతంలో చర్చి, గ్యాస్​ స్టేషన్, హోటల్, మ్యూజియం, బార్లు సహా ఏళ్ల నాటి ఇళ్లు కార్చిచ్చు ధాటికి దగ్ధమయ్యాయి.

దీంతో గ్రీన్​విల్లే పరిసర ప్రాంత ప్రజలను తమ నివాసాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు.

అటు మౌంటెన్ నగరం కూడా మంటలకు ఆహుతైంది. దీంతో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.

జులై 14న కాలిఫోర్నియాలో మొదలైన ఈ కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు సుమారు 13 రాష్ట్రాలకు విస్తరించింది.

దాదాపు 1,305 కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు అగ్నిమాపక శాఖ వెల్లడించింది.

ఇక ప్లుమాస్​ కౌంటీలో శరవేగంగా వ్యాప్తిస్తున్న మంటల ధాటికి భారీగా భవనాలు, వాహనాలు కాలి బూడిదయ్యాయి.

ఫ్లుమాస్‌తో పాటు టైలర్స్​విల్లే కౌంటీ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చదరపు కిలోమీటర్ల మేర దావానలం వ్యాపించింది.

మంటలు భారీగా ఎగసిపడుతూ ఆకాశాన్ని దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది.

హాలీవుడ్ సినిమాల్లో చూపించిన మాదిరిగా గ్రామాలకు గ్రామాలను దహించివేస్తోంది.