Business

చెక్కు బౌన్స్ నిబంధనలు మార్పు-వాణిజ్యం

చెక్కు బౌన్స్ నిబంధనలు మార్పు-వాణిజ్యం

* అకౌంట్ లో డబ్బు పెట్టుకోకుండా ముందస్తుగా చెక్కులు ఎవరికి కూడా ఇవ్వకండి , చట్ట సవరణ చేశారు.హామీకి కూడా ఖాళీ చెక్కులు ఇవ్వకండి.ఇకమీదట చెక్కులు బౌన్స్ అయితేఆ చెక్కు విలువలో 20 శాతం ముందస్తుగా కేసు తెలెవరకు కోర్ట్ ద్వారా అవతల పార్టీకి ఇవ్వాలి…అన్నిటికన్నా ముఖ్యం…ఇదివరకు మీరు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయితే మీ ఊళ్ళోనే కేసు నడిచేది…ఇప్పుడు suppose మీరు ఇచ్చిన ఖాళీ చెక్కులు అవతలి వాళ్ళు తమిళనాడులో ఒకచెక్కు , పశ్చిమ బెంగాల్ లో ఒక చెక్కు , ఢిల్లీ దగ్గరలో ఒక చెక్కు present చేస్తే , అవి బౌన్స్ అయితే,వాళ్ళు అక్కడ కోర్ట్ లోనే కేసులు వెయ్యవచ్చు…అంటే మీరు ఆ ఊళ్ళ చుట్టూ సచ్చినట్టు తిరగాల్సిందే…చెక్కు చాలా ప్రమాదకరం…చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడండి…ఎన్నో లక్షల చెక్కు బౌన్స్ కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్ ఉన్న కారణంగా ఇలా కఠినంగా చట్ట సవరణ చేశారు…క్యాబినెట్ లో పాస్ అయిన బిల్లులలో ఇది ఒకటి.

* కార్యకలాపాలు ప్రారంభించి వచ్చే ఏడాదికి ఐదేళ్లు పూర్తి అవుతున్నందున, చిన్న రుణాల బ్యాంక్‌ (స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌) లైసెన్సు కోసం పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ దరఖాస్తు చేసుకోనున్నట్లు సమాచారం. అయితే తుది నిర్ణయాన్ని కంపెనీ ఆ సమయంలోనే తీసుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చెల్లింపు బ్యాంకులుగా (పేమెంట్స్‌ బ్యాంక్స్‌) అయిదేళ్లు కార్యకలాపాలు పూర్తి చేసుకుంటే చిన్న రుణాల బ్యాంకు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. చెల్లింపు బ్యాంకులు చెల్లింపుల కార్యకలాపాలతో పాటు పరిమిత డిపాజిట్, ఖాతా సేవలను నిర్వహించవచ్చు. ఇతర బ్యాంకులకు బిజినెస్‌ కరస్పాండెంట్‌లుగా కూడా వ్యవహరించవచ్చు. కానీ రుణాలను మాత్రం ఇచ్చే వీలుండదు. చిన్న రుణాల బ్యాంక్‌గా మారితే రుణాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే పేమెంట్స్‌ బ్యాంక్‌గా ఒక సంస్థ కార్యకలాపాలు నిర్వహించిన తీరు ఆధారంగా చిన్న రుణాల బ్యాంకు లైసెన్సు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకుంటుంది. పేటీఎం 2017 మేలో ప్రారంభమైంది. 2022లో ఈ సంస్థకు పేమెంట్స్‌ బ్యాంక్‌గా ఐదేళ్లు పూర్తవుతాయి.

* ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్‌ ప్రతిష్ఠాత్మకమైన ‘రిటైల్‌ మీ ఐకాన్స్‌’ అవార్డు గెలుచుకుంది. దుబాయ్‌లో జరిగిన కార్యక్రమంలో దుబాయ్‌ పర్యాటక, వాణిజ్య మార్కెటింగ్‌ విభాగం సీఈఓ లైలా మొహమ్మద్‌ సుహైల్‌ నుంచి జోయాలుక్కాస్‌ గ్రూపు ఛైర్మన్‌ జాయ్‌ అలుక్కాస్‌ ఈ అవార్డును అందుకున్నారు. మా శ్రమకు, ఆభరణాల వ్యాపారంలో మేం ఆవిష్కరించిన అత్యున్నత ప్రమాణాలకు లభించిన గుర్తింపుగా దీన్ని జాయ్‌ అలుక్కాస్‌ అభివర్ణించారు.

* కొత్తగా ఒక ట్రావెల్‌ సంస్థ ప్రారంభించాలనుకుంటేనే బస్సులు ఎక్కడ కొనుగోలు చేయాలి? ఏ సంస్థ బస్సులు మన అవసరాలకు అనుకూలంగా ఉంటాయి? ఇలా పలు అంశాల్ని పరిశీలించి ముందుకు వెళుతుంటారు. అలాంటిది ఏకంగా కొత్త విమానయాన సంస్థను ప్రారంభించాలంటే ఎంత కసరత్తు ఉండాలి? ఏ సంస్థ తయారు చేస్తున్న విమానాలు కొనుగోలు చేయాలి? ఎన్ని కొనుగోలు చేయాలి? ప్రయాణికుల గిరాకీ ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతాయి. తాజాగా ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా 40 శాతం వాటాతో చౌక ధరల విమానయాన సంస్థను ప్రారంభించనున్న నేపథ్యంలో, ఆయన బోయింగ్‌ విమానాలు కొనుగోలు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే దేశీయంగా ఆ విమానాల తయారీ సంస్థకు మరో పెద్ద ఖాతాదారు లభించినట్లే. భారత్‌లో కొత్తగా చౌక ధరల విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్‌’ను ప్రారంభించడానికి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ కొత్త సంస్థలో 35 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.260 కోట్లు) మేర ఆయన పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థలో ఆయనకు 40 శాతం వాటా దక్కుతుంది. ఇండిగోలో సుమారు దశాబ్ద కాలం పాటు పని చేసిన ఆదిత్య ఘోష్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీఈఓ, డెల్టా ఎయిర్‌లైన్స్‌ మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన వినయ్‌ దూబే ఈ సంస్థలో సహ వ్యవస్థాపకులుగా ఉండబోతున్నారు.

* స్థానిక ఫార్మా కంపెనీ అయిన ఎస్‌ఎంఎస్‌ ఫార్మాసూటికల్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.164.28 కోట్ల ఆదాయాన్ని, రూ.23.19 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.2.74 ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.113.70 కోట్లు, నికరలాభం రూ.9.20 కోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆకర్షణీయమైన ఫలితాలు నమోదు చేసినట్లు అవుతోంది.