Health

మనిషి ఆరోగ్యం దెబ్బ తినడానికి ఈ మూడు కారణాలు

మనిషి ఆరోగ్యం దెబ్బ తినడానికి ఈ  మూడు కారణాలు

మనిషి ఆరోగ్యం చెడిపోవడానికి 3 ముఖ్యమైన కారణములు:

1. తగినంత శారీరక శ్రమ లేకపోవడం:
మనిషికి కలిగే శారీరక నొప్పులకి, బాధలకు మూలకారణం శరీరంలోని అన్ని అవయవములకి పని కల్పించకపోవడం. అంటే కూర్చునేటప్పుడు క్రిందకూర్చోవాలి, వంగేటప్పుడు వంగాలి, బరువులు మోయాల్సి వచ్చినప్పుడు తగినంతగా మొయ్యాలి, బరువులు ఎత్తేటప్పుడు ఎత్తాలి, నిద్ర వచ్చేటప్పుడు గాఢంగా నిద్ర పోవాలి. స్త్రీలు మామూలుగా తమఇంట్లో చేసే పనులవల్ల, పురుషులు బయటచేసే పనులవల్ల శరీరంలోని అన్ని అవయవములుకు సక్రమంగా పని చేయించడం జరుగుతుంది. అందువలన స్త్రీ,పురుషులు తమ తమ పనుల్ని తప్పక చేసుకొనవలెను. లేదంటే కొన్నాళ్ళకి కూర్చోవాలన్నా కూర్చోలేరు, నిలబడలేరు,నడవలేరు,వంగలేరు. ఏ వస్తువు ఎక్కడ తీస్తే,అక్కడికివెళ్లి పెట్టాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం,యోగ వంటివి చెయ్యాలి. చెమట,దుమ్ముతో చర్మవ్యాధులు రాకుండ ఉదయం,సాయంత్రం రోజుకు రెండుసార్లు తప్పకుండ అన్ని కాలాల్లోనూ స్నానంచేసి దీపారాధన చేయవలెను. శరీరం పరిశుద్దంగా ఆరోగ్యంగా ఉండే మనిషి ఎప్పుడు ఉత్సాహాంగా ఉంటాడు. ఎలాంటి కార్యాన్నైనా సాధించడానికి ఉత్సాహం చాలా అవసరం.

2. తినే ఆహారం, త్రాగే నీరు మరియు పీల్చే గాలి సరిగా లేక పోవడం:
మన శరీరం లోపల అన్ని వ్యాధులకు మూల కారణం మనం తినే ఆహారం. అందువల్ల చేసే పనిబట్టి తగినంతగా మంచి భోజనం చెయ్యాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. తినే ఆహారంలో ఎక్కువగా అన్నిరకాల కూరగాయలు, ఆకు కూరలు,పండ్లు పాలు,పెరుగు, నెయ్యి ఉండేటట్లు చూసుకొనవలెను. అలాగే స్వచ్ఛమైన నీటిని తగినంత త్రాగుతూ, మంచి గాలిని పీల్చవలెను.

3. మనస్సు పరిశుద్ధంగా ఉంచక పోవడం:
ప్రస్తుత కాలంలో మనిషికి సంబంధిచిన కొన్నివ్యాధులకు అంటే రక్తపోటు(బి. పి) ఒత్తిడి(స్ట్రెస్)కి మూలకారణం మానసిక సమస్యలే అని డాక్టర్స్ చెబుతున్నారు. అంటే మనస్సును స్వచ్ఛంగా ఉంచకపోవడం. అందుకోసం మనసులో ఎప్పుడు ఎలాంటి దుష్టఆలోచల్ని, కోపం, అసూయ, ద్వేషం, రానీయకుండా, పరిశుద్ధంగా ఉంచడానికి “ఓం నమో నారాయణాయ”, “ఓం నమఃశివాయ”, “ఓం శ్రీ మాత్రే నమః” అంటూ భగవన్నామాన్ని స్మరిస్తుండాలి. ఖాలీ సమయములలో రామాయణం,మహాభారతం,భాగవతం,భగవద్గీత, శివ పురాణం వంటి భాగవత కధలు చదువుతూ, ప్రాణాయామం, ధ్యానం, వంటి “అష్టాంగ యోగ” విద్య చెయ్యాలి.
ఒక్క నెలరోజులైనా యోగాని,ప్రాణాయామంని,ధ్యానంని చేసి చూడండి, మీలో మార్పు కన్పిస్తుంది.మీ మాటల్లోగాని మీ నడవడికలోగాని, ఆలోచించే విధానంలోగాని, ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడంలోగాని మీకా మార్పనేది స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల ప్రాణాయామంని,ధ్యానంని చేయడమనేది ఎట్టి పరిస్థితులలోనూ ఆపవద్దు.