Devotional

సెప్టెంబర్‌ 10 నుంచి కాణిపాక బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్‌ 10 నుంచి కాణిపాక బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 10 నుంచి 21 రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి ఆలయ ఉభయదారులు తీర్మానించారు.సెప్టెంబర్‌ 10వ తేదీ శుక్రవారం చవితి రోజు నుంచి 21 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఉభయదారులు తీర్మానించారు. దీంతో అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాల పత్రికను ఉభయదారులకు చదివి వినిపించారు. అనంతరం ఈవో వెంకటేశు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల వివరాలను దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు వివరిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో వారు వాహనసేవలను ప్రాకారోత్సవం నిర్వహించమంటే ప్రాకారోత్సవం, గ్రామోత్సవం నిర్వహించమంటే గ్రామోత్సవం నిర్వహిస్తామని వివరించారు. అనంతరం ఉభయదారులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.