Movies

కియారా రేటు ₹5కోట్లు

కియారా రేటు ₹5కోట్లు

బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ దూసుకెళ్తున్న నటి కియారా అడ్వాణీ. మహేశ్‌ నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమై.. తెలుగులోనూ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. శంకర్‌-రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో కియారా కథానాయికగా ఎంపికయ్యారు. ఈ సినిమాలో నటించడానికి ఆమె పారితోషికం భారీగానే తీసుకుంటున్నారట. సాధారణంగా తీసుకునే రూ.4 కోట్ల రెమ్యూనరేషన్‌ కంటే కూడా రూ.కోటి ఎక్కువగా డిమాండ్‌ చేశారట ఈ బీటౌన్‌ భామ. మొత్తంగా రూ.5 కోట్లు కోరగా.. రూ.నాలుగు కోట్ల యాభై లక్షలకి చిత్రబృందం ఒప్పించిందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఒక్క సినిమాకి కియారా ఎంత సంపాదిస్తుందో తెలుసా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.