DailyDose

వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం-నేరవార్తలు

వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం-నేరవార్తలు

* వికారాబాద్ జిల్లా యాలాల మండలం బండమిది పల్లి గేట్ దగ్గర తాండూర్ నుండి కర్ణాటకి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న 6 ఆటోలను పట్టుకొన్న వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు యాలాల పోలీస్ స్టేషన్ కు ఆటోలను అప్పగించి అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు

* కడప జిల్లా…వివేకా హత్య ఆయుధాలు స్వాధీనం చేసుకున్న సీబీఐ…అనుమానితుల ఇళ్లలోనే ఆయుధాలు స్వాధీనం…సునీల్ తమ్ముడు కిరణ్ కుమార్ యాదవ్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన సీబీఐ…మొదట తనకు తెలియదంటూ సీబీఐ అధికారులనే తప్పుదోవ పట్టించిన సునీల్ యాదవ్.

* ఆమె ముగ్గురు పిల్లల తల్లి.. భర్తను కాదని మరో యువకుడితో రాసలీలలు.. అతడి కోసం ఎంత పనిచేసిందంటే⁉️భర్తతో నిత్యం గొడవ జరగడం భార్యకు నచ్చలేదు. తమ ప్రేమకు అడ్డు వస్తున్న భర్తను అంతం చేయాలని నిర్ణయించుకుంది. తన ప్రియుడు కాంబ్లే యువరాజ్‌తో కలిసి పక్కాగా ప్లాన్ చేసింది.ఆమె ముగ్గురు పిల్లల తల్లి.. భర్తను కాదని మరో యువకుడితో రాసలీలలు.. అతడి కోసం ఎంత పనిచేసిందంటే..పెళ్లై పిల్లలున్న మహిళ. భర్తను కాదని మరో యువకుడితో వివాహేతర సంబంధం. తమ ప్రేమకు అడ్డుగా వస్తున్నాడని భర్తను చంపేసింది. ఇద్దరూ కలిసి అతడిని కిరాతకంగా హత్య చేశారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను చంపేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో భర్తను చంపేసింది భార్య. ప్రియుడితో కలిసి.. అతడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మాన్గార్ బస్తీకి చెందిన ఉప్పాడే రోషన్ (35), అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోషన్ ఓ హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.ఐతే ముగ్గురు పిల్లలు ఉన్నా.. రోషన్ భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమెకు కాంబ్లే యువరాజ్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. క్రమంగా అది ప్రేమగా మారింది. చివరకు వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరు అప్పుడప్పుడు కలుస్తుండేవారు. ఈ విషయం రోషన్‌కు తెలియడంతో భార్యను నిలదీశాడు. ఐనా ఆమె వినకపోవగా.. ఎదురు తిరగడంతో.. మద్యానికి బానిసయ్యాడు రోషన్. రోజూ తప్పతాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. మనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.. ఇలాం చేయడం తప్పు అని అతడు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఎంత చెప్పినా ఆమె మారలేదు. ఇలా భార్యాభర్తలు ప్రతి రోజూ ఘర్షణ పడేవారు.భర్తతో నిత్యం గొడవ జరగడం భార్యకు నచ్చలేదు. తమ ప్రేమకు అడ్డు వస్తున్న భర్తను అంతం చేయాలని నిర్ణయించుకుంది. తన ప్రియుడు కాంబ్లే యువరాజ్‌తో కలిసి పక్కాగా ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఆగస్టు 7న డ్యూటీ తర్వాత ఎప్పటిలాగే మద్యం తాగి ఇంటికి వచ్చాడు రోషన్. అప్పటికే అతడి భార్య, ఆమె ప్రియుడు ఇంట్లో ఉన్నారు. రోషన్ చంపేసేందుకు స్కెచ్ వేసుకొని సిద్ధంగా ఉన్నారు. మద్యం సేవించి ఇంటికి వచ్చిన రోషన్‌ను అతడి భార్య, ప్రియుడు కాంబ్లే యువరాజ్ కలిసి కత్తితో పొడిచి చంపేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. మృతుడితో పాటు భార్య సెల్‌ఫోన్ డేటాతో పాటు చుట్టు పక్కల సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసును లోతుగా విశ్లేషించారు. చివరకు భార్యే అతడిని చంపిందని నిర్ధారణకు వచ్చారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించింది. పోలీసులు ఆమెతో పాటు ప్రియుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు…!!

* అడిగినంత లంచం ఇవ్వకుంటే అక్రమ కేసులు బనాయిస్తామని, ఒక యువకుని బెదిరించి ,ఆ యువకుడి మరణానికి కారణమైన చిల్లకల్లు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్-1687 ఎం.శివరామ కృష్ణ ప్రసాద్ ను, మరియు సిబ్బంది విధులు పట్ల సరైన పర్యవేక్షణ లేకుండా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా చిల్లకల్లు ఎస్ఐ కె.దుర్గా ప్రసాద్ రావు పై సస్పెన్షన్ వేటు విధిస్తూ ఈరోజు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు.

* ప్రకాశం జిల్లా…>◆తర్లుపాడు మండలం పోతలపాడు గ్రామ విఆర్వో అంబడిపూడి వెంకటేశ్వర్లు సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్.>◆పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఇటీవల రైతుల నుంచి డబ్బులు లంచం తీసుకున్న విషయంలో సోషల్ మీడియా వీడియోలో వైరల్ ఆయిన దానిపై కందుకూరు సబ్ కలెక్టర్ విచారణ చేశారు.>◆సబ్ కలెక్టర్ విచారణ అనంతరంవిఆర్వో ని సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు అందినట్లు తహసీల్దార్ శైలేంద్ర కుమార్ తెలిపారు…