Business

టోల్‌ప్లాజాలపై బాదుడు. PayTM IPOపై అనుమానాలు-వాణిజ్యం

టోల్‌ప్లాజాలపై బాదుడు. PayTM IPOపై అనుమానాలు-వాణిజ్యం

* నేషనల్ హైవేస్ పై ప్రయాణిస్తున్నపుడు.. టోల్ ప్లాజాలదో తలనొప్పి.. వేగంగా వెళ్తున్న వాహనానికి స్పీడ్ బ్రేకర్ లా ఎదురవటమే కాదు.. నిమిషాల కొద్దీ ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. కానీ ఇపుడీ వెయింటింగ్ కి బ్రేకులు వేసే యత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ లను తెరపైకి తెచ్చారుగా.. ఇంకా ఏంటీ కొత్త మెథడ్ అంటే అదే జీపీఎస్ తో కూడిన టోల్ ఫీజుల వ్యవస్థ. అంటే, దీన్ని అత్యంత త్వరలోనే వాడకంలోకి తెస్తామంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. వచ్చే రోజుల్లో టోల్ ప్లాజాలు- వాటిల్లోని బూత్ లను పూర్తిగా లేకుండా చేస్తామంటున్నారు కేంద్ర మంత్రి.రష్యాకు చెందిన టెక్నాలజీ ద్వారా జీపీఎస్ అనే- గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పని చేస్తుందని అన్నారు నితిన్ గడ్కరీ. దీని ప్రకారం.. వాహనం ప్రయాణించే దూరాన్నిబట్టీ.. ఈ- వాలెట్ లేదా వాహన యజమాని బ్యాంక్ ఖాతా నుంచి టోల్ ఫీజు డిడెక్ట్ అవుతుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఎలెక్ట్రానిక్ టోల్ వ్యవస్థ అమల్లో ఉంది.. దీన్ని జాతీయ రహదారుల సంస్థ నిర్వహిస్తోంది.. ఇకపై దీన్ని కూడా లేకుండా చేస్తామనీ.. ఏడాది లోపు జీపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని లోక్ సభలో చెప్పారు నితిన్ గడ్కరీ. ప్రస్తుతం తయారవుతున్న వాహనాలన్నీ గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్ తో అనుసంధానమై ఉన్నాయ్. పాత బండ్లలో ఈ విధానాన్ని తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు కేంద్రమంత్రి గడ్కరీ.

* తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టుల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి అందాయి. మొత్తం ఆరింటిలో మూడు మాత్రమే పూర్తిస్థాయి ఎయిర్ పోర్టుల నిర్మాణం, పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలమని, మరో మూడు అందుకు అనుకూలంగా లేవని ఎయిర్ పోర్టుల అథారిటీ తేల్చింది. తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది.
మొత్తం ఆరింటిలో 3 మాత్రమే అన్ని రకాల తగిన విధంగా ఉన్నాయని ఎయిర్ పోర్టు అథారిటీ తన నివేదికలో పేర్కొంది. వివిధ దఫాల్లో క్షేత్రస్థాయి సందర్శన చేసిన కేంద్ర బృందాలు. వరంగల్లోని మామూనూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లోని జక్రాన్ పల్లిలు మాత్రమే పూర్తిస్థాయి విమానాశ్రయాలకు అనుకూలంగా ఉన్నాయని నివేదించాయి. భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్ నగర్ లోని దేవరకద్ర, పెద్దపల్లిలోని బసంత్ నగర్లు ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు, పెద్ద విమాన రాకపోకలకు అంతగా అనుకూలంగా లేవని భారత విమానయాన సంస్థకు ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నాయి.

* క‌రోనా మ‌హ‌మ్మారి వేళ విదేశాల‌కెళ్ల‌డం సంగ‌తి దేవుడెరుగు.. దేశీయంగా వివిధ ప్రాంతాల మ‌ధ్య విమానాల్లో ప్ర‌యాణించే వారి జేబుల‌కు చిల్లులు ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది. విమాన స‌ర్వీసుల ప్ర‌యాణ టిక్కెట్ల ధ‌ర‌ల‌పై కేంద్ర విమాన‌యాన శాఖ ప‌రిమితులు పెంచుతూ నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం. క‌నిష్ట లేదా గ‌రిష్ఠ ప‌రిమితుల‌ను 9.83 నుంచి 12.82 శాతానికి పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

* ఆన్‌లైన్ పేమెంట్స్ స‌ర్వీసెస్ సంస్థ పేటీఎం ప్ర‌తిపాదిత ఐపీవో గ‌ట్టి అవ‌రోధం ఎదురు కానున్న‌ది. సంస్థ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడినంటూ అశోక్ కుమార్ స‌క్సేనా (71) అనే వ్య‌క్తి దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్ర‌ణ సంస్థ సెబీకి ఫిర్యాదు చేశారు. 2.2 బిలియ‌న్ల డాల‌ర్ల నిధులను సేక‌రించాల‌న్న ల‌క్ష్యంతో పేటీఎం ప్ర‌తిపాదించిన ఐపీవోను నిలిపివేయాల‌ని కోరారు. రెండు ద‌శాబ్దాల క్రితం పేటీఎం స‌హ వ్య‌వ‌స్థాప‌కుడిగా తాను 27,500 డాల‌ర్లు పెట్టుబ‌డులు పెట్టాన‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు తన‌కు షేర్లు కేటాయించ‌లేద‌ని పేర్కొన్నారు. పేటీఎం అశోక్ కుమార్ స‌క్సేనా ఆరోప‌ణ‌ల‌ను కొట్టి పారేసింది. స‌క్సేనా ఆరోప‌ణ‌లు పేటీఎంకు అడ్డంకులు క‌ల్పించ‌డానికేన‌ని పేర్కొంది.పేటీఎం వివ‌ర‌ణ తిర‌స్క‌రించిన సక్సేనా…పేటీఎం ప్ర‌క‌ట‌న‌ను అశోక్ కుమార్ స‌క్సేనా తిర‌స్క‌రించారు. పేటీఎం ప్ర‌స్తుతం హై ప్రొఫైల్ స్థానంలో ఉంద‌ని, త‌న వంటి ప్రైవేట్ వ్య‌క్తి ఆ సంస్థ‌కు అడ్డంకులు స్రుష్టించే స్థానంలో తాను లేన‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.మోస‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్న పేటీఎం ఐపీవోను అనుమ‌తిస్తే ఇన్వెస్ట‌ర్లు త‌మ పెట్టుబ‌డుల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని సెబీకి చేసిన ఫిర్యాదులో వెల్ల‌డించారు.ఐపీవోకు అనుమ‌తులు జాప్యం అవుతాయా..తాజా వివాదం నేప‌థ్యంలో రెగ్యులేట‌రీ విచార‌ణల‌తో పేటీఎం ఐపీవో జాప్యం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఇన్ గ‌వ‌ర్న్ అనే అడ్వైజ‌రీ సంస్థ వాటాదారు శ్రీరాం సుబ్ర‌మ‌ణ్యం అన్నారు.అదే స‌మ‌యంలో తాజా వివాదం వ‌ల్ల కంపెనీకి గానీ, వాటాదారుల‌కు గానీ ఎటువంటి న‌ష్టం వాటిల్ల‌బోద‌ని సెబీకి పేటీఎం యాజ‌మాన్యం హామీ ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు.తాజా వివాదం నేప‌థ్యంలో ఇత‌ర వాటాదారులైన ఆలీబాబా, సాఫ్ట్ బ్యాంక్ నుంచి పేటీఎంకు స‌మ‌స్య‌లు పెంచి ఉన్నాయ‌ని తెలుస్తున్న‌ది.విజ‌య్‌శేఖ‌ర్‌-స‌క్సేనా మ‌ధ్య ఒప్పందం ఇదీ…పేటీఎం సీఈవో విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ‌కు, అశోక్ కుమార్ స‌క్సేనాకు మ‌ధ్య 2001లో కుదిరిన ఒక పేజీ ఒప్పంద‌ ప‌త్రం ఈ వివాదానికి కేంద్రంగా క‌నిపిస్తున్న‌ది.పేటీఎం పేరెంట్ సంస్థ వ‌న్‌97 క‌మ్యూనికేష‌న్స్‌లో స‌క్సేనాకు 55 శాతం వాటా, మిగ‌తా విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ‌కు కేటాయించాల్సి ఉంటుంది. దీనిపై పేటీఎం గానీ, సంస్థ సీఈవో విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ గానీ స్పందించ‌లేదు.ప్ర‌భుత్వ డేటా ప్ర‌కారం స‌క్సేనా పేటీఎం డైరెక్ట‌ర్‌…పేటీఎం స‌మ‌ర్పించిన ప‌త్రాల ప్ర‌కారం ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న డేటాబేస్ ప్ర‌కారం 2000-04 మ‌ధ్య‌ సంస్థ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రు అశోక్ కుమార్ స‌క్సేనా అని ఉంది.పోలీసుల‌కు ఇచ్చిన నివేదిక‌లో పేటీఎం పేరెంట్ సంస్థ తొలి డైరెక్ట‌ర్ల‌లో ఆయ‌న ఒక‌ర‌ని అంగీక‌రిస్తున్న‌ది. కానీ ఆయ‌న క్ర‌మంగా త‌న హ‌క్కుల‌ను వ‌దులుకున్నార‌ని చెబుతున్న‌ది.స‌క్సేనాపై పేటీఎం ఇలా..2003-04 మ‌ధ్య త‌మ సంస్థ షేర్ల‌ను ఇండియ‌న్ సంస్థ‌కు బ‌దిలీ అయ్యాయ‌ని పేటీఎం వాదించింది. సంస్థ యాజ‌మాన్యంతో అశోక్ కుమార్ స‌క్సేనా ప్రైవేట్‌గా అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని వాదిస్తున్న‌ది.కానీ ఈ వాద‌న‌నూ స‌క్సేనా కొట్టి పారేస్తున్నారు. తాను ఎటువంటి షేర్ల‌ను అందుకోలేద‌ని, ఏ ప్రైవేట్ ఒప్పందం చేసుకోలేద‌న్నారు.కుటుంబ స‌మ‌స్య‌ల వ‌ల్లే ప‌ట్టించుకోలేద‌న్న స‌క్సేనా…ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న అశోక్ కుమార్ స‌క్సేనా త‌న కుటుంబ స‌భ్యుల‌కు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నానని చెప్పారు. పేటీఎంలో పెట్టుబ‌డుల ప‌త్రాలు గత వేస‌విలో దొరికాయ‌ని పేర్కొన్నారు. షేర్లు, మ‌నీ ఒక అంశం అని, కానీ, త‌న‌ను స‌హ వ్య‌వ‌స్థాప‌కుడిగా గుర్తించాల‌ని కోరారు.ఢిల్లీ కోర్టుకు వివాదం.. ఈ నెల 23న విచార‌ణ‌…ప్ర‌స్తుతం ఈ వివాదం ఢిల్లీ కోర్టుకు చేరుకున్న‌ది. దీనిపై ఢిల్లీ పోలీసుల‌ను కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించాల‌ని గ‌త నెల‌లో న్యాయ‌మూర్తిని అభ్య‌ర్థించారు. ఈ నెల 23 లోగా ప్ర‌తిస్పందించాల‌ని ఢిల్లీ పోలీసుల‌ను కోర్టు ఆదేశించింది.