DailyDose

బందరులో ప్రిన్సిపాళ్ల ముష్టియుద్ధాలు-నేరవార్తలు

బందరులో ప్రిన్సిపాళ్ల ముష్టియుద్ధాలు-నేరవార్తలు

* ‘ఒంటరిగా ఉన్నామని ఫీలవుతున్నారా.. మీ భావాలను పంచుకోవడానికి ఒక మంచి స్నేహితుడు/స్నేహితురాలు కావాలా..?’ అంటూ వచ్చే ఈ ఒక్క ఎస్‌ఎంఎస్‌ ఎందరో యువకుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కాసేపు మనసు విప్పి మాట్లాడుదాంలే అనుకునేలోపే వలపు వలకు చిక్కి.. బయటకు రాలేకపోతున్నారు. తమకు జరిగిన మోసం ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే మానసికంగా కుమిలిపోతున్నారు. ఈ తరహాలోనే విశాఖ యువకుడి నుంచి జీడిమెట్లకు చెందిన గుండా జ్యోతి(24).. రూ.24 లక్షలు వసూలు చేసింది. బాధితుడి ఫిర్యాదుతో విశాఖ పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దర్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. కుత్బుల్లాపూర్‌లోని ఓ కాల్‌సెంటర్‌లో సుమారు 25 మంది అమ్మాయిలు పనిచేశారు. అది మూతపడటంతో వీరందర్నీ అక్కడే పనిచేసే టీం లీడర్‌ కృష్ణాజిల్లాకు చెందిన షాహిక్‌ అబ్దుల్‌ రెహమాన్‌(30) చేరదీశాడు. ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చి వీరితో ఈ మోసాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. వీరే కాకుండా ఇంకా నగరంలో చాలామంది కి‘లేడీ’లు ఉన్నారని అప్రమత్తంగా ఉండాలంటూ సైబరాబాద్‌, రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.వలకు ఎలా చిక్కుతున్నారంటే…మార్కెటింగ్‌ కంపెనీలు, సర్వీస్‌ ప్రొవైడర్లు, కాల్‌సెంటర్ల నుంచి బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ పంపిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు ఎస్‌ఎంఎస్‌లో ఉన్న నంబర్లకు ఫోన్‌ చేయగానే కి‘లేడీ’లు రంగంలోకి దిగుతున్నారు. వర్చువల్‌ నంబర్లతో కాల్‌ చేస్తున్నారు. పది పదిహేను రోజులు తరచూ ఫోన్లు చేసి ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. బాధితులు వారి నంబర్‌ అడిగితే కి‘లేడీ’లు నకిలీ ధ్రువపత్రాలతో తీసుకున్న నంబర్లను ఇస్తున్నారు.ఇక్కడి నుంచే అసలు కథ..ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. వాట్సాప్‌లో ఛాటింగ్‌ చేస్తూ ముగ్గులోకి దింపుతున్నారు. వీడియో కాల్స్‌ చేసి రెచ్చగొడుతున్నారు. నగ్నంగా చూడాలని ఉందా..? అంటూ అడుగుతున్నారు. పైన దుస్తులు మాత్రమే తీసేస్తే రూ.500, ఇంకొంచెం కిందకైతే రూ.వెయ్యి, పూర్తిగా నగ్నంగా చూడాలనుకుంటే రూ.2వేలు చెల్లించాలని సూచిస్తున్నారు. ఇక్కడే చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఒకటి, రెండు దశలు పూర్తి కాగానే బాధితులను కూడా నగ్నంగా కనిపించాలంటూ రెచ్చగొడుతున్నారు. అప్పుడు ‘స్క్రీన్‌ రికార్డింగ్‌’తో వీడియో (బాధితులు నగ్నంగా ఉన్నప్పుడు) చిత్రీకరిస్తున్నారు. తర్వాత ఆ వీడియోను వాట్సాప్‌లో పంపిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయాలా..? అంటూ బెదిరింపులకు దిగి డబ్బులు వసూలు చేస్తున్నారు.

* స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట ఢిల్లీ పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. ఢిల్లీలో ఉగ్రదాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు అందించిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 55 తుపాకులు, 50 లైవ్ బుల్లెట్ కార్ట్రిడ్జ్ లు ఉన్నాయి. ఈ నలుగురు ఆయుధాల అక్రమ రవాణా ముఠా సభ్యులుగా భావిస్తున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒకరు ఢిల్లీ వాసి కాగా, మిగిలిన వారు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు. నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. డ్రోన్లు, బెలూన్లపై నిషేధం విధించారు.

* అనంతపురం జిల్లాలోని బసవనపల్లి యునైటెడ్ ఆయిల్ ఇండస్ట్రీలో అధికారులు తనిఖీలు..అక్రమంగా దాచిన కోటి 27 లక్షల విలువైన 3,983 కేజీల శ్రీగంధం చెక్కలు స్వాధీనం..కేరళ రాష్ట్రానికి చెందిన కృష్ణన్ అరెస్ట్‌….మరో ఇద్దరు పరారీ…పరారీలో వున్న నిందితులు కోసం పోలీసులు గాలింపు….కేసు నమోదు చేసి విచారణ జరుపతున్న పోలీసులు.

* కృష్ణాజిల్లా మచిలీపట్నం…ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నా ప్రిన్సిపాల్, మాజీ ప్రిన్సిపాల్…పద్మావతి మహిళా హిందూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజమణిక్యం పై దాడి…పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కాలేజీలో ముష్టి యుద్ధాలు …దాడి చేసిన చేసిన మాజీ ప్రిన్సిపాల్ మాలతిరేఖ (ప్రస్తుతం అదే కాలేజీలో ఆధ్యాపకురాలు) లీవులెటర్ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం …స్థానిక మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేయచున్న రాజమణిక్యంపై దాడి చేసిన అదే కాలేజీలో పనిచేసిన మాజీ ప్రిన్సిపాల్ మాలతిరేఖ.