WorldWonders

గాంధీలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం-నేరవార్తలు

గాంధీలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం-నేరవార్తలు

* హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. పేషెంట్‍ కు సాయంగా వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెల్లకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇద్దరు బాధితుల్లో ఒకరు ఇంటికి చేరుకున్నారు. కానీ మరో మహిళ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఇంతకీ ఆమె ఏమైనట్లు. నిందితులు ఆమెను ఏం చేశారు.మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వేపురిగేరికి చెందిన కర్నె నర్సింహులు కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల 4న హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి లో అడ్మిట్‌ అయ్యాడు.ఆయనకు సాయంగా భార్య తిరుపతమ్మ ఆమె చెల్లెలు సువర్ణ వెళ్లారు. నర్సింహులును వేరు వార్డుకు మార్చడంతో అది ఎక్కడో తెలియక అక్కాచెల్లెల్లు తికమకపడ్డారు.ఆ సమయంలో ఓపీ సెక్షన్‌లోని కంప్యూటర్‍ ఆపరేటర్‌ ఉమామహేశ్వర్‍ వార్డు చూపిస్తానని మచ్చిక చేసుకున్నాడు. వారిని ఓ స్టోరూంలోకి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చారని బాధితురాలు చెబుతోంది. తనపై నలుగురైదుగురు అత్యాచారం చేసినట్లు బాధితురాలు విలపిస్తోంది.బాధితులు ముందుగా మహబూబ్‌నగర్ వన్‌టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. కానీ గాంధీ ఆస్పత్రి పరిధిలోని పీఎస్‌కు వెళ్లాలని సూచించడంతో వారు మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.గాంధీ ఆస్పత్రిలో ఐదు రోజులుగా ఇంత దారుణం జరిగినా వెలుగు చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వెంటనే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని బంధవులు డిమాండ్ చేస్తున్నారు.

* గుంటూరు రేంజ్ ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ కామెంట్స్.రమ్య శ్రీ హత్య కేసులో ముద్దాయిని మీడియా ముందు హాజరుపరిచిన అర్బన్ పోలీసులు.ఇన్ స్టాగ్రామ్ లో గత 6 నెలల క్రితం శశికృష్ణకి రమ్యతో పరిచయం ఏర్పడింది.అప్పటి నుండి శశికృష్ణ రమ్యని తాను చదువుతున్న కాలేజ్ వద్ద కలుస్తూ, ప్రేమిస్తున్నానని వేధించాడు.ప్రేమకు ఆమె నిరాకరించడంతో..శశికృష్ణ ఈ ఘతుకానికి ఒడిగట్టాడు.మహిళల పై దాడులు చేసే వారి పై కఠిన చర్యలు తీసుకుంటాము.సోషల్ మీడియా పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలి.సోషల్ మీడియాలలో పరిచయ అయ్యే వ్యక్తులకు దూరంగా ఉండాలి.కేసులో ప్రతిభ కనపరచిన పోలీసులకు రివార్డులు.

* మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యప్తును వేగవంతం చేసిన సీబీఐ.పులివెందులలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో పలువురిని విచారిస్తున్న సీబీఐ అధికారుల బృందం .ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాశ్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ బృందం .ఇతను వైఎస్ జగన్ కు పెదనాన్న అవుతారు.

* కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం దొడ్డిమేకలలో దారుణం జరిగింది. భార్యకు పురుగుల మందు తాగించాడో కసాయి భర్త.

* కాబుల్‌ విమానాశ్రయంలో భీతావహ వాతావరణం నెలకొంది….. కాబుల్‌ విమానాశ్రయంలో రద్దీని నియంత్రించేందుకు భద్రతాదళాలు కాల్పులు జరిపారు.. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

* దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రాంగణంలో ఘోరం జరిగింది. ఓ మహిళ, ఓ వ్యక్తి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన సుప్రీంకోర్టు గేట్​ డీ వద్ద జరిగింది.అక్కడే ఉన్న పోలీసులు మంటలను ఆర్పి, బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అయితే.. బాధితుల ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు.వారు ఎవరో గుర్తించాల్సి ఉందన్నారు. ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు.

* చిత్తూరులో భారీ ఎత్తున రూ.16 లక్షల విలువగల నిషేధిత,గుట్కా పాన్ మసాలా మరియు రూ.4 లక్షలు విలువ చేసి కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని 12 మంది అరెస్టు.