Business

వంటగ్యాస్‌పై పాతిక రూపాయిలు పెంచిన సర్కార్-వాణిజ్యం

వంటగ్యాస్‌పై పాతిక రూపాయిలు పెంచిన సర్కార్-వాణిజ్యం

* ఈనెల 19 సాయంత్రం 5 వరకు అగ్రిగోల్డ్ డిపాజిటర్ల వివరాలను సరిచూసుకునేందుకు సీఐడీ గడువు పొడిగించింది.రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 నుంచి డిపాజిటర్ల వివరాలను సేకరణ కొనసాగుతోంది.రూ. 20 వేలలోపు డిపాజిట్ చేసిన బాధితులు తమ వివరాలను సరిచూసుకోవచ్చని సీఐడీ తెలిపింది.డబ్బు చెల్లించిన అసలు రసీదులతో వాలంటీర్ల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.వాలంటీర్ల వద్ద వీలు కాకపోతే ఎంపీడీవో కార్యాలయంలో పత్రాలు ఇవ్వాలని తెలిపింది.

* మరోసారి వంటగ్యాస్ ధర పెరిగింది. వంటగ్యాస్​ ధర రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి పెట్రోలియం సంస్థలు.దీనితో 14.2 కిలోల ఎల్​పీజీ సిలిండర్ ధర దిల్లీలో రూ. 859.50కి చేరింది. పెరిగిన ధరలు ఆగస్టు 17 నుంచే అమల్లోకి వచ్చాయి.గత ఏడు నెలల్లో సిలిండర్ రీఫిల్ ధరలు రూ.140 పెరిగాయి. ఫిబ్రవరి 4 రూ.25, ఫిబ్రవరి 15న రూ.50, ఫిబ్రవరి 25న రూ.25, మార్చి1న రూ.25, మార్చి31న రూ.10 పెరిగింది. అంతకుముందు జులై 1న వంటగ్యాస్ ధర రూ. 25.50 పెరిగింది.

* వంట నూనెల దిగుమతి తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా దేశీయంగా నూనె గింజన ఉత్పత్తి పెంచాలని డిసైడ్‌ అయ్యింది.అందుకు తగ్గట్టుగా  మిషన్ ఆఫ్‌ ఆయిల్‌పామ్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మిషన్‌ ఆయిల్‌పామ్‌ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది.వంట నూనెల ధరలు ఇటీవల అనూహ్యంగా పెరిగాయి.ఇండియా వంట నూనెల్లో సగానికి పైగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్‌, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల బ్రెజిల్‌, అమెరికాలలో ఆయిల్‌ ముడి సరుకుల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి.మరోవైపు ఇండోనేషియా, మలేషియాలు ఎగుమతి సుంకాలు పెంచాయి. వెరసి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.ఇటీవల కేంద్రం వంట నూనెలపై న్నులు తగ్గించింది. అయినా ధరలు అదుపులోకి రాలేదు.

* పూచీకత్తు లేకుండానే రుణాలు.. ఆటాడితే చాలు రూ.లక్షలు.. మదుపు చేస్తే కళ్లు చెదిరే లాభాలంటూ విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులకు ఆశచూపి.. యాప్‌ల ద్వారా రూ.వేలకోట్ల లావాదేవీలు నడిపించి, అందినంతా కొల్లగొట్టిన నేరస్థుల వెనుక చైనీయులున్నారంటున్నారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. మాల్‌ 008 యాప్‌ ద్వారా మోసాలు చేస్తున్న ఇద్దరు నిందితులు శ్రీనివాసరావు, విజయ్‌కృష్ణను ఇటీవలే పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ యాప్‌ వెనుక ఇద్దరు చైనీయులున్నారని, వీరికీ రుణయాప్‌లతో ఇప్పటికే వేలకోట్లు దోచేసిన చైనీయులకు మధ్య సంబంధాలున్నాయని ఆధారాలు సేకరించారు. నేరగాళ్లు ఒక్క హైదరాబాద్‌లోనే రూ.32,850 కోట్ల లావాదేవీలు నడిపించినట్లు, అందులో సుమారుగా సగం దోచేసినట్లు గుర్తించారు.. ఈ సమాచారాన్ని కేంద్ర నిఘా అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు నివేదించారు. ఈ కేసుల్లో మరో ఐదుగురు చైనీయులను అరెస్ట్‌ చేయాల్సి ఉందని వివరించారు.