ScienceAndTech

చైనా హ్యాకర్ల దాడికి గురైన కంగనా ఇన్‌స్టా

చైనా హ్యాకర్ల దాడికి గురైన కంగనా ఇన్‌స్టా

బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని బుధవారం వెల్లడించారు. ‘‘ చైనా నుంచి నా అకౌంట్‌ హ్యాక్‌ చేయడానికి ప్రయత్నించినట్లు ఇన్‌స్టా నుంచి నిన్న రాత్రి అలర్ట్‌ వచ్చింది. ఈరోజు నా అకౌంట్‌ తెరిచి చూస్తే సడన్‌గా కనిపించకుండా పోయింది. తాలిబన్ల గురించి నేను చేసిన పోస్టులన్నీ కనుమరుగయ్యాయి. నా అకౌంట్‌ని హ్యాక్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వారికి ఫిర్యాదు చేసిన అనంతరం మళ్లీ నా అకౌంట్‌ తిరిగి వచ్చింది. కానీ ఏదైనా రాసే క్రమంలో లాగ్‌ఆఫ్‌ అవుతుంది. అందుకే నా సోదరి ఫొన్‌ నుంచి నా అకౌంట్‌ ఓపెన్‌ చేసి ఈ స్టోరీ పెడుతున్నా. ఇదంతా ఓ అంతర్జాతీయ కుట్ర.. నమ్మశక్యంగా లేదు’’ అని పేర్కొన్నారు.