DailyDose

అంతర్రాష్ట్ర దొంగని పట్టుకున్న నూజివీడు పోలీసులు-నేరవార్తలు

అంతర్రాష్ట్ర దొంగని పట్టుకున్న నూజివీడు పోలీసులు-నేరవార్తలు

* ఏడు వేలు లంచం తీసుకుంటూ ఆరిలోవ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ శ్రీనివాస్ శుక్రవారం ఏసీబీకి చిక్కారు . ప్రస్తుతం ఆరిలోవ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ బృందం తనిఖీలు చేపడుతున్నారు.ఆరిలోవ శ్రీకాంత్ నగర్ ప్రాంతానికి చెందిన బి. వైకుంఠ రావుతనకు సంబంధించిన కేసులో తన ఫ్యామిలీ మెంబర్స్ ను డిలీట్ చేసి తను ఒక్కరికి 41 A (స్టేషన్ బెయిల్) నోటీస్ ఇచ్చేందుకు ఏడు వేలు డిమాండ్ చేయడంతో అతడు విశాఖ ఏసీబీకి అదికారులకు పిర్యాదు చేసారు .దింతో వలపన్ని స్టేషన్ ఎస్ ఐ శ్రీనివాస్ ని ఏసీబీ adhikaarulu పట్టుకున్నారు .

* ఆగిరిపల్లి లో అంతర్రాష్ట్ర దొంగ అబుదాసరి బాలు ప్రసాద్ ను అరెస్ట్ చేసిన నూజివీడు పోలీసులు. నిందితుడు వద్ద రూ.9లక్షల 8వేల విలువైన 103 గ్రాముల బంగారం,570 గ్రాముల వెండి, 5 మోటారు సైకిళ్ళు పలు విలువైన వస్తువులు స్వాధీనం. నిందితుడిపై మూడు జిల్లాలో 36 కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. నిందితుడుపై కేసు నమోదు చేసి నూజివీడు కోర్టులో హాజరు పరిచిన పోలీసులు.

* పూసపాటిరేగ మండలం చౌడువాడలో దారుణం చోటుచేసుకుంది. ఓ కిరాతకుడు యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన యువతి అక్క, అమె కుమారుడికి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు బాధితులను విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని నరవకు చెందిన యువకుడిగా గుర్తించారు.
ఇటీవల యువతితో వివాహం కుదుర్చుకున్న యువకుడు.. మరో యువకుడితో ఆమె మాట్లాడుతోందని పెళ్లి రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి రెండు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ కుదిర్చారు. పోలీసుల సూచనతో వివాహం చేసుకునేందుకు యువకుడు అంగీకరించాడు. ఆ తర్వాత నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

* లక్నో ఎయిర్‌పోర్ట్ లో విదేశీ బంగారం పట్టివేత.

* కల్ కత్తాలో భారీగా బంగారం పట్టివేత. సింథిమూర్ సిటి లో కస్టమ్స్ అధికారుల దాడులు. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్.