Devotional

రాఖీ పౌర్ణమి విశిష్టత-కథ

రాఖీ పౌర్ణమి విశిష్టత-కథ

ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను TV “శ్రావణపూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ” మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగ అని పిలుస్తూ ఉంటారు. జంధ్యాలు ధరించే వారందరూ ఈరోజున నూతన జంధ్యాలు ధరిస్తారు. 

ఈ రోజు బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్ధులకు వేదపఠనం ప్రారంభిస్తారు. వేదపండితులు వేదాలను వల్లెవేయడం అంటే; ఆ వృత్తి చెయ్యడం ఈ రోజునుండే ప్రారంభిస్తారు. ఆ విధంగా వీరు ఈరోజు వేదాలన్నింటిని ప్రారంభ ఋక్కును, చివరి ఋక్కును పఠిస్తారు. కాలక్రమంలో ఈ రోజు “రక్షాబంధన్ లేక రాఖీ” పండుగగా ప్రాచుర్యం పొందసాగింది. ఈ రక్షాబంధనము ఈ దిగువ మంత్రాన్ని పఠిస్తూ భార్య – భర్తకు, సోదరి – సోదరునకు యుద్ధానికి వెళ్ళే వీరునకు విజయప్రాప్తి కోసం ఈ రక్షాబంధనన కడుతూఉంటారు. 

యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః| 
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల|| 

శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని మంత్రార్థం. ఈ – రక్షాబంధన్ ఎలా ప్రారంభమైనది అంటే! ఈ గాథ మనకు మంచి ప్రామాణిక మవుతుంది. 

పూర్వం దేవతలకు – రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధము సాగింది. ఆ యుద్ధములో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని ‘అమరావతి’ లో తలదాచుకుంటాడు. అట్టి భర్తనిస్సహాయతను గమనించిన ఇంద్రాణి ‘శచీదేవి’ తగు తరుణోపాయమునకై ఆలోచిస్తూ ఉన్న సమయాన ఆ రాక్షసరాజు చివరకు ‘అమరావతి’ని కూడా దిగ్భంధన చేయబోతున్నాడు అని గ్రహించి, భర్త దేవేంద్రునకు ‘సమరోత్సాహము’ పురికొలిపినది. సరిగా ఆరోజు “శ్రావణ పూర్ణిమ” అగుటచేత ‘పార్వతీ పరమేశ్వరులను’, లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజించబడిన “రక్షా” దేవేంద్రుని చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరు వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునకు కట్టి ఇంద్రుని విజయాత్రకు అండగా నిలచి, తిరిగి ‘త్రిలోకాధిపత్యాన్ని’ పొందారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన ‘ఆ రక్షాబంధనోత్సవం’ నేడు అది ‘రాఖీ’ పండుగ ఆచారమైనది. 

ఈ రాఖీకి ఉన్న పవిత్రత ఏమిటంటే భార్య – భర్తకు, సోదరి – సోదరులకు కట్టే రాఖీ వారి వారు తలపెట్టే కార్యములు విజయవంతమై సుఖసంపదలు కలగాలని, వారి మాన మర్యాదలకు వారు బాసటగా ఉండాలని ఆకాంక్షించే సత్ సంప్రదాయమే ఈ ‘రాఖీ’ విశిష్టత. అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు వార్కి నూతన వస్త్రాలు చిరుకానుకలు సమర్పించి, అందరు కలసి చక్కని విందు సేవిస్తారు. 

విదేశీయులు మనదేశాన్ని పాలిస్తున్న రోజులలో మొగాలాయీల దుర్నీతికి దురంతాలకు ఏమాత్రం అడ్డూ అపూ అనేది లేకుండా పోయేది. హిందూ జాతి వారి కబంధహస్తాలలో నలిగిపోయేది. స్త్రీలు వారి మాన ప్రాణరక్షణకై వీరులైన యోధులను గుర్తించి వార్కి ‘రక్షాబంధనం’ కట్టి వారు చూసే సోదర భావముతో, రక్షణ పొందేవారు. ఒకసారి ‘రాణి కర్ణావతి’ శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించినప్పుడు ‘ఢిల్లీపాదుషాకు’ రాఖీ పంపగా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆ సోదరి ఇంట భగినీ హస్తభోజనంచేసి, కానుకలు సమర్పించినట్లు గాధలు ఉన్నాయి. 

####################

రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే

పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.

రాఖీపౌర్ణమి చరిత్ర

ద్రౌపది – శ్రీకృష్ణుని బంధం

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.

శ్రీ మహావిష్ణువు – బలిచక్రవర్తి

శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. (ప్రాచీన గాథ ” యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల” భావం- ఓ రక్షాబంధమా! మహాబలవంతుడూ, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరస్తున్నాను.)

అలెగ్జాండర్‌ భార్య – పురుషోత్తముడి కథ

చరిత్రపుటల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చఁపవద్దని రోకా్సనా పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చఁపకుఁడా విడిచిపెడతాడు.