NRI-NRT

చిరంజీవితో సమావేశమైన ఆటా ప్రతినిధులు

చిరంజీవితో సమావేశమైన ఆటా ప్రతినిధులు

మెగాస్టార్ చిరంజీవితో అమెరికా తెలుగు సంఘం(ఆటా) ప్రతినిధులు ఆదివారం నాడు ఆయన నివాసంలో భేటీ అయ్యారు. 45నిముషాలు పాటు సాగిన ఈ సమావేశంలో ఆటా ప్రతినిధులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆటా-చిరంజీవి రక్తనిధితో కలిసి కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. కోవిద్ సమయంలో ఆటా అందించిన సేవా కార్యక్రమాలను ప్రతినిధులు చిరంజీవికి వివరించారు. ఈ ఏడాది 2021 డిసెంబరులో జరిగే ఆటా వేడుకలకు హాజరు కావల్సిందిగా ఆయనను ఆటా అధ్యక్షుడు భువనేష్ బూజాల నేతృత్వంలోని ప్రతినిధులు ఆహ్వానించారు. జులై 2022లో జరిగే ఆటా మహాసభలకు కూడా హాజరు కావల్సిందిగా వారు కోరారు. ప్రస్తుతం 5సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్‌కు ఆటా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.