NRI-NRT

సింగపూర్‌లో ఘనంగా WAM శ్రావణపౌర్ణమి

సింగపూర్‌లో ఘనంగా WAM శ్రావణపౌర్ణమి

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (WAM) సింగపూర్ విభాగం అధ్వర్యంలో సింగపూర్ లో నివసిస్తున్న వైశ్యులు శ్రావణపౌర్ణమి సందర్భంగా యజ్ఞోపవీతధారణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. WAM సింగపూర్ అధ్యక్షుడు నల్ల భాస్కర్ గుప్త, కంకిపాటి శశిధర్, పత్తూరి కిరణ్ కుమార్, ఉద్దగిరి సతీష్ ల సారధ్యంలో ధార్మిక విషయాలకు పెద్దపీట వేస్తూ వైదిక కార్యక్రమమైన జంధ్యాల పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. పురోహితులు శ్రావణ్ పర్యవేక్షణలో ఈ వేడుకలు నిర్వహించారు. అంతర్జాలంలో జరిగిన ఈ కార్యక్రమం కలశ స్థాపనతో మొదలై, గణపతి పూజ, గాయత్రి మంత్ర పఠనం తదితరాదుల అనంతరం ఆశీర్వచనంతో ముగిసినది. వామ్ (WAM) సింగపూర్ కమిటి సభ్యులు సంకా వెంకట రవికుమార్, కంచర్ల శరత్ బాబు, కోట సతీష్, వుద్దగిరి భాను తేజ, రేపాక మధుకర్, ప్రసాద్ బచ్చు, నామ శ్రీపాద, సంతోష్ కటకం తదితరులు పాల్గొన్నారు.