Business

విదేశీ విద్య అభ్యసించే ఆడపిల్లలకు రుణాలపై రాయితీలు-వాణిజ్యం

విదేశీ విద్య అభ్యసించే ఆడపిల్లలకు రుణాలపై రాయితీలు-వాణిజ్యం

* దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు మంగళవారం ఓ దశలో ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ సూచీలో షేరు విలువ రూ.1,755.60కు చేరింది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7.45 లక్షల కోట్లకు చేరింది. దీంతో 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన నాలుగో భారతీయ కంపెనీగా ఈ సంస్థ నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఇప్పటికే 100 బిలియన్ డాలర్లు దాటిన విషయం తెలిసిందే.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజైన మంగళవారమూ లాభాలతో ముగిశాయి. లోహ, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు రాణించడం ఇందుకు దోహదం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 18.5 శాతంగా ఉండనుందన్న ఎస్‌బీఐ అంచనాలు కూడా మార్కెట్‌ సెంటిమెంటును బలోపేతం చేశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 74.20 వద్ద ముగిసింది.

* గ‌త‌వారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ల‌ను ప్రారంభించాయి. ప్ర‌భుత్వ రంగంలోని ఎస్‌బీఐ పేరున్న పెద్ద బ్యాంక్ అవ్వ‌డం, ప్రైవేట్ రంగంలోని పేరున్న బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఈ డిపాజిట్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం క‌స్ట‌మ‌ర్ల‌ను డిపాజిట్ల‌ప‌రంగా బాగా ఆక‌ర్షించే విష‌య‌మే. ఎస్‌బీఐ ప్లాటినం డిపాజిట్ల‌ను, హెచ్‌డీఎఫ్‌సీ గ్రీన్ డిపాజిట్ల‌ను కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టాయి.

* Discounts Edu-Loans to Girls | విదేశాల్లో ఉన్న‌త విద్యా కోర్సులు అభ్య‌సించే విద్యార్థుల కోసం క‌రోనా రెండో వేవ్ త‌ర్వాత పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు మ‌రోసారి తెరుచుకుంటున్నాయి. అత్య‌ధిక కాలేజీలు సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇండియ‌న్ విద్యార్థుల్లో అత్య‌ధికులు అమెరికాలో విద్యాభ్యాసం చేయ‌డానికే మొగ్గు చూపుతున్నారు. ఇందువ‌ల్లే వీసా అప్లికేష‌న్ల ప్ర‌క్రియ వేగం పుంజుకుంటున్న‌ది. ఈ క్ర‌మంలో విదేశాల్లో ఉన్న‌త విద్యాభ్యాసం కోసం దేశీయ ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (బీవోబీ) రుణాలిచ్చేందుకు ముందుకు వ‌చ్చాయి. విద్యార్థినుల రుణాల‌పై 50 శాతం వ‌డ్డీ రాయితీ క‌ల్పిస్తున్నాయి. ఈ రెండు బ్యాంకులు ఇచ్చే రుణాల‌పై వ‌డ్డీరేట్లు ఒక‌టే. రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలు అని నిర్ణ‌యించాయి ఎస్బీఐ, బీవోబీ. అయితే, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా మాత్రం రూ.80 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలిస్తుంది. ఎస్బీఐతోపాటు విద్యార్థినుల విద్యారుణాల‌పై రాయితీ క‌ల్పిస్తున్న‌ది. ఇంకా న‌ర్స‌రీ స్కూల్ నుంచి విద్యా రుణాలు అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐ రూ.1.50 కోట్ల వ‌ర‌కు రుణాలిస్తుంది. విదేశాల్లో ఉన్న‌త విద్య‌న‌భ్య‌సించే విద్యార్థుల‌కు మాత్ర‌మే ఎస్బీఐ ప్ర‌త్యేకించి ఎస్బీఐ గ్లోబ‌ల్ యాడ్‌-వంటేజ్ ఓవ‌ర్సీస్ ఎడ్యుకేష‌న్ లోన్ అందిస్తున్న‌ది. క‌స్ట‌మైజ్డ్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద ఆఫ‌ర్లు అందిస్తున్న‌ది. గ్రాడ్యుయేష‌న్‌, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌, డిప్ల‌మా, డాక్ట‌ర్ కోర్సుల‌కు రుణాలు ల‌భిస్తాయి. అమెరికా, బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా, కెన‌డా, యూర‌ప్‌, జ‌పాన్‌, సింగ‌పూర్‌, హాంకాంగ్‌, న్యూజిలాండ్ దేశాల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల‌కు రూ.1.5 ల‌క్ష‌ల నుంచి రూ.1.5 కోట్ల వ‌ర‌కు రుణ ప‌ర‌ప‌తి ల‌భిస్తుంది. రుణాల‌పై విద్యార్థుల‌కు ఏటా 9.15 శాతం వడ్డీరేటు వ‌ర్తింప చేస్తే, బాలిక‌ల‌కు 8.65 శాతం మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. విద్యాభ్యాసం పూర్త‌యిన ఆరు నెల‌ల నుంచి రుణ వాయిదా చెల్లింపులు మొద‌ల‌వుతాయి. మీరు రుణ గ్ర‌హీత‌లైతే రీ పేమెంట్ ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు. ఈ రుణం గ‌రిష్ఠంగా 15 ఏండ్ల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ప్ర‌యాణ ఖ‌ర్చులు, ట్యూష‌న్ ఫీజు, ప‌రీక్ష‌లు, లైబ్ర‌రీ, ల్యాబ్ ఫీజు త‌దిత‌రాల‌కు క‌లిపి రుణం మంజూరు చేస్తాయి బ్యాంకులు. ప్రాజెక్ట్ వ‌ర్క్‌, స్ట‌డీ టూర్ కోసం మొత్తం ట్యూష‌న్ ఫీజులో 20 శాతం రుణం పొందొచ్చు. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయొచ్చు. మీరు ఎస్బీఐ వెబ్‌సైట్‌కెళ్లి https://bank.sbi/web/personal-banking/loans/education-loans/global-ed-vantage-scheme ను క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డ‌మే. అయితే ఐ-20 వీసా జారీ కావ‌డానికి ముందే రుణానికి అప్ర‌వూల్ పొందాలి. ఈ రుణంపై మీరు ఆదాయం ప‌న్ను చ‌ట్టం 80ఈ సెక్ష‌న్ కింద మిన‌హాయింపు క్ల‌యిమ్ చేయొచ్చు. మీ పిల్ల‌లకు విద్యా రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి వ‌స్తే 10వ‌, 12వ త‌ర‌గ‌తి మార్క్ లిస్ట్ కావాలి. ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితం ప్ర‌తి కూడా స‌మ‌ర్పించాలి. యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ లెట‌ర్‌, ఆఫ‌ర్ లెట‌ర్‌తోపాటు గుర్తింపు కోసం ఐడీ కార్డ్ స‌మ‌ర్పించాలి. కోర్సు పూర్తి షెడ్యూల్ స‌మ‌ర్పించాలి.. ఒక‌వేళ మ‌ధ్య‌లోనే డ్రాప్ అయితే, గ్యాప్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. విద్యార్థి, అత‌డి త‌ల్లిదండ్రులు, గార్డియ‌న్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్‌లు స‌మ‌ర్పించాలి. విద్యా రుణం రూ.7.50 ల‌క్ష‌లు దాటితే గ్యారెంట‌ర్ త‌న ఆస్తుల ద్ర‌వ్య‌ల‌భ్య‌త ప్ర‌క‌ట‌న‌ను అంద‌జేయాల్సి ఉంటుంది. గార్డియ‌న్‌గా ఉండే గ్యారెంట‌ర్ ఆస్తుల‌ను బ‌ట్టి ఎంత రుణం ఇవ్వాలో బ్యాంకులు నిర్ణ‌యిస్తాయి. విద్యార్థి తండ్రిగా మీరు తాజా మీ వేత‌న స్లిప్‌, ఫామ్‌-16 లేదా ఇటీవ‌ల స‌మ‌ర్పించిన ఐటీ రిట‌ర్న్స్ ప‌త్రాల‌ను బ్యాంక‌ర్ల‌కు అంద‌జేయాలి. మీకు వేత‌నం ఇచ్చే సంస్థ బిజినెస్ చిరునామా, ఐటీ రిట‌ర్న్స్ ఇవ్వాలి. విద్యార్థి, త‌ల్లిదండ్రులు, గార్డియ‌న్ కం గ్యారెంట‌ర్ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌, ఓట‌ర్ ఐడీ కార్డు, పాన్ కార్డు,ఆధార్ అవ‌స‌రం ఉంటాయి.