NRI-NRT

డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా దుగ్గిరాల కిరణ్

డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా దుగ్గిరాల కిరణ్

అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘంగా ప్రఖ్యాతిగాంచిన డెట్రాయిట్ తెలుగు సంఘం(DTA) 46వ అధ్యక్షుడిగా కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం ముదునూరుకు చెందిన దుగ్గిరాల కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నాడు ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. యూకె నుండి 2008లో పెన్సిల్వేనియా వచ్చిన కిరణ్, 2012 నుండి మిషిగన్‌లో నివసిస్తున్నారు. తానా ప్రాంతీయ ప్రతినిధిగా సేవలందించిన ఆయన నందమూరి బాలకృష్ణ వీరాభిమానిగా అమెరికాలో సుపరిచితులు. 45ఏళ్ల ప్రముఖ తెలుగు సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైన కిరణ్‌కు అమెరికావ్యాప్తంగా ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. 1976లో ఏర్పాటు చేసిన డెట్రాయిట్ తెలుగు సంఘం 2021 ఎన్నికలకు ఈ ఏడాది అధ్యక్ష, కార్యదర్శ, కోశాధికారి పదవులకు మూడు నామినేషన్లు మాత్రమే వచ్చాయని, కావున వీరి ముగ్గురినీ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధ్యక్షుడు నెరుసు సత్యం, కార్యదర్శి వేణులు ప్రకటించారు. నూతన కార్యదర్శిగా ఇంజేటి సత్య, కోశాధికారిగా ఒమ్మి ఉమా మహేశ్వరరావులు ఎన్నికయ్యారు.
డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా దుగ్గిరాల కిరణ్-Kiran Duggirala Elected As Detroit Telugu Association DTA President