Movies

ముంబయి మేయర్‌గా సోనూసూద్?-తాజావార్తలు

ముంబయి మేయర్‌గా సోనూసూద్?-తాజావార్తలు

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 58,890 పరీక్షలు నిర్వహించగా.. 1,248 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,04,590 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,750కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,715 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,77,163కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,677 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,61,98,824 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

* ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రి నియామకం

* టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మరో రసవత్తరపోరుకు సమయం దగ్గరపడింది. బుధవారం నుంచి ఇరు జట్లూ హెడింగ్లీ లీడ్స్‌ వేదికగా మూడో టెస్టులో తలపడనున్నాయి. ఇప్పటికే లార్డ్స్‌లో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌లో దూసుకుపోవాలని చూస్తోంది. మరోవైపు రెండో టెస్టులో అధికభాగం ఆధిపత్యం చెలాయించిన ఆతిథ్య జట్టు చివరిరోజు అనూహ్య రీతిలో ఓటమిపాలైంది. దాంతో మూడో టెస్టులోనైనా కోహ్లీసేననను ఓడించి సిరీస్‌ సమం చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మరో ఆసక్తికర టెస్టు తప్పదనే అనిపిస్తోంది.

* జాతీయ ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే రూ.400 కోట్లు చెల్లించామని, మరో రూ.1100 కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కోర్టు విచారణకు హాజరైన ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్.ఎస్‌ రావత్‌.. పంచాయతీల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం… గుత్తేదారులకు సొమ్ము చెల్లించి ఆ వివరాలు హైకోర్టుకు నివేదించాలని ఆదేశించింది.

* కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. ఈ నెల 27న జరగాల్సిన బోర్డు సమావేశాన్ని సెప్టెంబర్ 1కి వాయిదా వేశారు. 27వ తేదీన జరగాల్సిన 14వ సమావేశం ఎజెండాను గతంలోనే ఖరారు చేసిన బోర్డు.. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం అందించారు. రెండు రాష్ట్రాలకు చెందిన పలు అంశాలు, గెజిట్ నోటిఫికేషన్ పరిధి సంబంధిత అంశాలను ఎజెండాలో చేర్చారు.

* మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో దీక్షలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌ దత్తత గ్రామంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మూడుచింతలపల్లిలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించారో ఇంటింటికీ తిరుగుదాం వస్తారా అంటూ తెరాస నేతలను నిలదీశారు. గ్రామంలో 57 ఏళ్లు నిండిన వారిలో ఎంతమందికి పింఛను ఇచ్చారని ప్రశ్నించారు.

* ఆదివాసులకు రక్షణగా ఉన్న చట్టాలను జగన్‌ ప్రభుత్వం కాలరాస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. రంపచోడవరం ఐటీడీఏ తీరుపై ఉద్యమిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపడం దారుణమని మండిపడ్డారు. చర్చల పేరుతో ఆహ్వానించి, పోలీసులతో నిర్బంధించి, నేరం చేసిన వాళ్లలా నేలపై గిరిజన ప్రతినిధుల్ని కూర్చోబెట్టి తీవ్రంగా అవమానించడం జగన్‌ అధికార దర్పానికి పరాకాష్ట అని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

* రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డివైడర్ మధ్యలో ఉన్న గ్రిల్స్ ఎక్కి మరీ ప్రగతి భవన్ వైపు విద్యార్థి, యువజన సంఘ నేతలు పరుగులు తీయడంతో పోలీసులు అడ్డుకున్నారు.

* మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ రాణేను పోలీసులు అరెస్టు చేశారు. సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు గానూ ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

* కల్లోలిత అఫ్గానిస్థాన్‌ నుంచి తమ దేశ పౌరులను తీసుకెళ్లేందుకు వచ్చిన ఉక్రెయిన్‌ విమానం ఒకటి హైజాక్‌కు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో వచ్చి ఈ విమానాన్ని కాబుల్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇరాన్‌ తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్‌ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్‌జెనీ యెనిన్‌ తెలిపారు.

* ఛత్తీస్‌గఢ్‌లో రొటేషన్‌ ఫార్ములాలో భాగంగా ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగించాలంటూ ఓ మంత్రి డిమాండ్‌ చేయడం ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో విభేదాలకు కారణమయ్యింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌, ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్‌సింగ్‌ డియో వ్యవహారం దిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి పీఠంపై వాదన వినిపించేందుకు ఇరువురు నాయకులు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజైన మంగళవారమూ లాభాలతో ముగిశాయి. లోహ, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు రాణించడం ఇందుకు దోహదం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 18.5 శాతంగా ఉండనుందన్న ఎస్‌బీఐ అంచనాలు కూడా మార్కెట్‌ సెంటిమెంటును బలోపేతం చేశాయి.

* రాబోయే ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా సోనూసూద్‌ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సెలబ్రిటీలని రంగంలోకి దించుతోందని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ జాబితాలోని ముగ్గురిలో ఒకరిని మేయర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించే అవకాశం ఉందని వినికిడి. అయితే, ఈ ఊహాగానాలపై నటుడు సోనూ క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తల్లో వాస్తవం లేదని, సామాన్యుడిగా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు.

* రాష్ట్రంలో సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సన్నద్ధతపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, విద్య, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో సమీక్షించారు. పాఠశాలల పునఃప్రారంభానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, విద్యార్థుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని మంత్రి సబిత ఆదేశించారు.

* మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్‌ దత్తత గ్రామంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మూడుచింతలపల్లిలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించారో ఇంటింటికీ తిరుగుదాం వస్తారా అంటూ తెరాస నేతలను నిలదీశారు. గ్రామంలో 57 ఏళ్లు నిండిన వారిలో ఎంతమందికి పింఛను ఇచ్చారని ప్రశ్నించారు.

* రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డివైడర్ మధ్యలో ఉన్న గ్రిల్స్ ఎక్కి మరీ ప్రగతి భవన్ వైపు విద్యార్థి, యువజన సంఘ నేతలు పరుగులు తీయడంతో పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి గోషామహాల్‌ స్టేషన్‌కు తరలించారు. నిరుద్యోగులకు వయసు మీరి పోతున్నా ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.