Politics

సెప్టెంబర్ 15న తేలనున్న జగన్ బెయిల్-నేరవార్తలు

సెప్టెంబర్ 15న తేలనున్న జగన్ బెయిల్-నేరవార్తలు

* తాడేపల్లి సీఎం నివాసం వద్ద ఇళ్ళు అక్రమ కూల్చివేత సమయంలో నిరసన తెలిపిన శివశ్రీ సోదరుడు అనిల్ కుమార్ తక్కెళ్లపాడు వద్ద అనుమానాస్పద మృతి..

* నక్కపల్లి హైవేపై తృటిలో తప్పిన పెను ప్రమాదం.రెండు లారీల మధ్య నలిగిపోయిన రెండు కార్లు.కారులో చిక్కుకున్న నలుగురిని కాపాడిన ఎస్ ఐ వెంకన్న, స్థానికులు.నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హైవేపై బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తృటిలో తప్పింది.నక్కపల్లి సర్కిల్ పరిధిలోని హైవే జంక్షన్ లపై మెయింటినెన్స్ పనులు చేయని ప్రాంతంలో హైవే కు ఇరువైపులా కూడా ఇష్టానుసారం ఎన్ హెచ్ ఏ ఐ సిబ్బంది స్టాపర్స్ ను ఎక్కువగా పెడుతున్నారు.దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం తుని నుంచి ఎలమంచిలి వెళ్లే మార్గంలో సరిగ్గా నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హైవేపై పెద్ద ప్రమాదం చెప్పింది.ముందు వేగంగా వెళ్తున్న ఒక ఆటో ను సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న లారీని కూడా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి ఆపేశాడు.

* జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ లపై నిర్ణయం వచ్చేనెల 15న వెలువరిస్తామంటూ… కోర్టు కేసును వాయిదా వేసింది. ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్‌లపై తీర్పును ఒకేసారి కామన్ ఆర్డర్‌గా ఇస్తామని సీబీఐ కోర్ట్ స్పష్టం చేసింది.

* ఒంగోలు మండలం, ముక్తినూతలపాడు, వీఆర్వో, P రమాదేవి, 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు

* తిరుమల శ్రీవారి ఆలయంకు వెనుక వైపు ఉన్న మ్యూజియం దగ్గరకు నలుగురు ఎర్రచందనం కూలీలు చేరుకున్నారు.ఫేస్ రెకగ్నజైడ్ కెమెరాలు ఈ ఎర్రచందన కూలీలను పట్టించాయి.ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఎర్రచందనం కూలీలు కలకలం రేపారు.అడవిలో దారి తప్పి శ్రీవారి ఆలయంకు వెనుక వైపు ఉన్న మ్యూజియం దగ్గరకు నలుగురు ఎర్రచందనం కూలీలు చేరుకున్నారు.ఫేస్ రెకగ్నజైడ్ కెమెరాలు ఈ ఎర్రచందన కూలీలను పట్టించాయి.సీసీ కెమెరాల్లో గమనించి అప్రమత్తం చేయడంతో దగ్గరలోని భద్రతా సిబ్బందిని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తం చేశారు.నలుగురు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నించారు.నలుగుర్ని ప్రశ్నించగా.. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఐదుగురి కోసం అటవీ శాఖ అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

* రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా నూతనంగా నియామకమైన అడిషనల్ డిజి డా. అనిల్ కుమార్, ఇవాళ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసారు.