Politics

అతను చంద్రబాబు తొత్తు. మల్లారెడ్డికి జోష్ ఎక్కువ-తాజావార్తలు

అతను చంద్రబాబు తొత్తు. మల్లారెడ్డికి జోష్ ఎక్కువ-తాజావార్తలు

* విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే చెందుతుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. అంబర్‌పేట ఏడీఈగా కె.సీనయ్య బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మార్యాదపుర్వకంగా ఎమ్మెల్యేను కలిసారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ బాధ్యలు చేపట్టినప్పటి నుండి హైదరాబాద్‌కే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కరెంట్‌ కోతలు లేకుండా నిరంతర విద్యుత్‌ అందిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.

* తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎంఎస్ రామ‌చంద్రరావు నియామ‌కం అయ్యారు. అత్యంత సీనియ‌ర్ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రామ‌చంద్ర‌రావుకు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మితులైన జ‌స్టిస్ ఎంఎస్ రామ‌చంద్ర‌రావు హైద‌రాబాద్‌కు చెందిన వ్య‌క్తి. 1966, ఆగ‌స్టు 7న హైద‌రాబాద్‌లో జ‌న్మించారు. న‌గ‌రంలోని సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివారు. ఇంట‌ర్ లిటిల్ ఫ్ల‌వ‌ర్ కాలేజీలో, బీఎస్సీ భ‌వ‌న్స్ న్యూ సైన్స్ కాలేజీలో పూర్తి చేశారు. 1989లో ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి లా ప‌ట్టా పుచ్చుకున్నారు. ఎల్ఎల్‌బీ తృతీయ సంవ‌త్స‌రంలో అత్య‌ధిక మార్కులు సాధించినందుకు సీవీఎస్ఎస్ ఆచార్యులు గోల్డ్ మెడ‌ల్‌ను రామ‌చంద్ర‌రావు అందుకున్నారు. 1989, సెప్టెంబ‌ర్ నెల‌లో అడ్వ‌కేట్‌గా త‌న పేరును న‌మోదు చేసుకున్నారు. 1991లో యూకేలోని కేంబ్రిడ్జి యూనివ‌ర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం ప‌ట్టా సాధించారు.

* బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాదయాత్ర‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయ‌న పేరు బండి సంజ‌య్.. పెట్రోల్‌ ధ‌ర ఎక్కువైవంద‌ని బండిలో తిర‌గ‌కుండా.. పాద యాత్ర చేస్తున్నాడంటా అని విమ‌ర్శించారు. ఆయ‌న‌కు వ‌చ్చిన‌ స‌మ‌స్య ఏంటి? ప్ర‌జా సంగ్రామ యాత్ర ఎందుకు చేస్తున్నాడో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో హైద‌రాబాద్‌లో వ‌ర‌ద‌లు వ‌చ్చాయి.. అదే స‌మ‌యంలో వ‌ర‌ద‌లు వ‌చ్చిన గుజ‌రాత్‌కు రూ. 1000 కోట్లు, ఇంకొ చోట రూ. 500 కోట్లు ఇచ్చాం. తెలంగాణ‌కు మొండి చెయ్యి చూపాం. అయినా త‌మ‌ను ఆశీర్వ‌దించండి అని అడుగుతారా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు

* అక్రమాస్తుల కేసుల్లోని ఏపీహెచ్‌బీ గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్ షీట్ నుంచి తొలగించాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీబీఐ తప్పుడు అభియోగాలు మోపిందని జగన్ కోర్టుకు తెలిపారు. అదే ఛార్జ్ షీట్‌లో రెండో నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా తన పేరు తొలగించాలని కోరుతూ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు విచారణ సెప్టెంబరు 3కి వాయిదా వేసింది. పెన్నా కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. పెన్నా ఛార్జ్‌షీట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారులు శామ్యూల్, వి.డి.రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణను సెప్టెంబరు 1కి వాయిదా వేసింది.

* మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ చుట్టు పక్కల భూములు కొనుగోలు చేస్తే సేల్‌డీడ్‌ చేయాల్సిందేనని.. కానీ 16 ఎకరాలకు మల్లారెడ్డి బావమరిది ఎలా యజమాని అయ్యారో వివరాలు లేవన్నారు. గిఫ్ట్‌ డీడ్‌ చూపెట్టి మల్లారెడ్డి వర్శిటీకి అనుమతి తెచ్చుకున్నారని ఆరోపించారు.

* ‘‘రాజకీయాల్లో ఉన్నవారు సంస్కారవంతంగా మాట్లాడాలి. చంద్రబాబు తొత్తు, బినామీని కాంగ్రెస్ దిగుమతి చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించాలా? మహారాష్ట్ర సీఎంపై వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రిని లోపలేశారు. మల్లారెడ్డికి జోష్‌ ఎక్కువ.. ఒక మాట అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ఎందుకు చేయబోతున్నారో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు’’ అని ప్రతిపక్ష నేతలపై కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు.