DailyDose

విశాఖ ఏజెన్సీలో టన్ను గంజాయి పట్టివేత-నేరవార్తలు

విశాఖ ఏజెన్సీలో టన్ను గంజాయి పట్టివేత-నేరవార్తలు

* విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టివేత…ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం వద్ద రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు 1000 కిలోల గంజాయిని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో.స్వాధీనం చేసుకున్న గంజాయి పాడేరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలింపు.

* అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిగిన పేలుళ్లపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల్లో అమెరికా సైనికుల మృతిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోమని..ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడింది తామేనని ఇప్పటికే ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని తమ దేశ ఆర్మీని బైడెన్‌ ఆదేశించారు. ఈనెల 31 కల్లా అఫ్గాన్‌ నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు.

* ప.గో : భీమవరంలో ఇద్దరు నకిలీ విలేకరులను అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీసులు.దుర్గాపురంలో పాన్ షాపు యజమానిని బెదిరించి 10,000. ఒకరి వద్ద 5000 డిమాండ్ ఏసి వసూలు చేసిన నకిలీ విలేకరులు.ఇద్దరు నకిలీ విలేకరులు భీమవరం మండలం దిరుసుమర్రుకు చెందిన రవితేజ, ప్రవీణ్ కుమార్.ఏపి క్రైమ్ న్యూస్ చానల్ పేరుతో అక్రమాలుకు పాల్పడుతున్న రవితేజ, ప్రవీణ్ కుమార్.ఇద్దరు నకిలీ విలేకర్ల ను అరెస్టు చేసి కేసు నమోదు చేసిన టూ టౌన్ సీఐ కృష్ణ కిషోర్.

* అసోంలో ఆగంతకుల ఘాతుకానికి ఐదుగురు బలయ్యారు. రాష్ట్రంలోని దిమా హసావో జిల్లా దియుంగ్బ్రాలో ఏడు ట్రక్కులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ట్రక్కుల్లో ఉన్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. మంటల్లో ఐదుగురు కాలి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నామని, దీనివెనక దిమాసా నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ (డీఎన్‌ఎల్‌ఏ) హస్తమున్నట్లు అనుమానిస్తున్నామని జిల్లా ఎస్పీ జయంత్‌ సింగ్‌ తెలిపారు. గురువారం రాత్రి దియుంగ్బ్రాలో ట్రక్‌ డ్రైవర్లు, ఇతరులపై ఆయుధాలతో ఐదుగురు మిలిటెంట్లు కాల్పులు జరిపారని, అనంతరం ఆ ట్రక్కులకు నిప్పంటించారని ఎస్పీ చెప్పారు. ఈ దాడి వెనక డీఎన్‌ఎల్‌ఏ అనే మిలిటెంట్‌ సంస్థ ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అస్సామ్‌ రైఫిల్స్‌కు చెందిన భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. కాలిపోయిన వాహనాల నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశామన్నారు. ఆ ట్రక్కుల్లో బొగ్గు, ఇతర సామాగ్రిని సమీపంలో ఉన్న సిమెంట్‌ పరిశ్రమలకు తీసుకెళ్తున్నారని వెల్లడించారు.