ScienceAndTech

ఢిల్లీలో నయాగరా. కరోనాకు రక్తపింజరి విషమే విరుగుడు-తాజావార్తలు

ఢిల్లీలో నయాగరా. కరోనాకు రక్తపింజరి విషమే విరుగుడు-తాజావార్తలు

* ప్రాణం తీసే పాము విషాన్ని ఔషధంగా మారిస్తే అదే ప్రాణాలనూ నిలుపుతుంది. ఇప్పటికే పలు రకాల ఔషధాల తయారీలో కొన్ని సర్పాల విషాన్ని వినియోగిస్తున్నారు. తాజాగా కొవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసే గుణం కూడా ఓ పాము విషంలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాల్ని ‘మాలిక్యూల్స్‌’ అనే జర్నల్‌లో ప్రచురించారు. బ్రెజిల్‌లో కనిపించే ఒక రకమైన రక్తపింజరి విషం కొవిడ్‌ చికిత్సలో ఉపయోగపడే అవకాశం ఉందని బ్రెజిల్‌లోని సావోపాలో విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. ఈ పాము విషంలోని ఓ పదార్థం వైరస్‌ పునరుత్పత్తిని కోతిలో సమర్థంగా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. దాదాపు 75 శాతం వరకు వైరస్‌ పునరుత్పత్తి నిలిచిపోయినట్లు తెలిపారు.

* తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి విజయలక్ష్మి(63) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచినట్టు అన్నాడీఎంకే పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆమె మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి పన్నీర్‌ సెల్వం, ఆయన తనయుడు, ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌లను ఓదార్చారు.

* దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. గత 24 గంటల్లో దిల్లీలో రికార్డు స్థాయిలో 112.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఇదిలా ఉండగా.. దిల్లీ వర్షాలకు సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. వికాస్‌పురి ప్రాంతంలో ఓ ఫ్లైఓవర్‌ వరదనీటితో నిండిపోవడంతో ఆ వంతెనపై నుంచి నీరు కింద ఉన్న రోడ్డుపై పడింది. ఇది అచ్చంగా జలపాతంలా కన్పించింది. దీంతో ఈ వీడియోను పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ ‘దిల్లీకి నయాగరా వచ్చింది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లోనూ దిల్లీలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రానున్న గంటల్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. దిల్లీ వ్యాప్తంగా ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

* తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాలిన్‌ వ్యవహరిస్తున్న తీరును ఆయన ప్రశంసించారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్‌లో పవన్‌ పేర్కొన్నారు.

* వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలు నిషేధించాలని న్యాయవాది వేణుమాధవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. నిమజ్జనం వేళ ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం, ఉత్సవ సమితి, పిటిషనర్‌ నివేదికలు సమర్పించాలని తెలిపింది. ఎక్కడికెక్కడ స్థానికంగానే విగ్రహాలను నిమజ్జనం చేస్తే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.

* నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) 14వ సమావేశం జరుగుతోంది. కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ ఎం.పి.సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన ఈ భేటీలో ప్రధానంగా 13 అంశాలపై చర్చించనున్నారు. ఇందులో తెలంగాణ, ఏపీ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.

* సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనడం దారుణమని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ‘‘మంత్రులు, ఉన్నతాధికారులు ఉండే రాజధానికి విలువ లేదా?జగన్‌ ప్రభుత్వంలో మంత్రులకు ప్రాధాన్యం లేదా?సీపీఎస్‌ గురించి గతంలో సీఎం జగన్‌ చెప్పిన దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పారు’’ అని రఘురామ తెలిపారు.

* తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కొవిడ్‌ నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాస్‌ తెలిపారు. కోఠిలోని ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో డీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మరణాల శాతం కేవలం 0.5 శాతం మాత్రమే ఉండగా.. రికవరీ రేటు 98.5 శాతం ఉందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1 నుంచి 10 ఏళ్లలోపు వారిలో కేవలం 3 శాతం మాత్రమే కొవిడ్‌ బారినపడినట్లు చెప్పారు.

* దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. గత 24 గంటల్లో దిల్లీలో రికార్డు స్థాయిలో 112.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది.

* ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రమ్‌ హోం) సదుపాయాన్ని వచ్చే ఏడాది వరకు పొడిగిస్తున్నట్లు టెక్‌ దిగ్గజం గూగుల్‌ ప్రకటించింది. గూగుల్‌ క్యాంపస్‌లకు తిరిగి వచ్చే విషయంలో ఉద్యోగులకు జనవరి 10 వరకు స్వేచ్ఛనిస్తున్నామని సంస్థ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. అలాగే ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపించుకునే విచక్షణాధికారాన్ని స్థానిక ఆఫీసులకు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

* చైనా ఇటీవల వ్యక్తుల, సంస్థల కీర్తి ప్రతిష్ఠలను అంచనా వేసి మరీ అణగదొక్కుతోంది. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థను మించిపోతారనుకుంటే నిర్దాక్షిణ్యంగా వారిని కనుమరుగు చేస్తోంది. ఇటీవల బిలియనీర్‌ జాక్‌ మా ఒక్కసారిగా అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా ఒక బిలియనీర్‌ నటీమణిపై కత్తిగట్టింది. చైనా ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఆమెను కనుమరుగు చేసే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది.

* తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి విజయలక్ష్మి(63) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచినట్టు అన్నాడీఎంకే పార్టీ వర్గాలు వెల్లడించాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల లాభాల జోరుకు బ్రేక్‌ పడింది. బుధవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. గతకొన్ని రోజుల బుల్‌పరుగు నేపథ్యంలో ముదపర్లు నేడు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు స్థిరీకరణ దిశగా సాగాయి. చివరకు 214 పాయింట్ల నష్టంతో 57,338 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 55 పాయింట్లు దిగజారి 17,076 వద్ద స్థిరపడింది.

* టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ కాస్త ఓపిక పట్టాలని మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సూచిస్తున్నాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లు అతడి వికెట్‌ కోసం చూపిస్తున్న సహనాన్నీ అతడు ప్రదర్శించడం లేదని పేర్కొన్నాడు. వదిలేయాల్సిన బంతులను ఆడుతూ వికెట్‌ ఇచ్చేస్తున్నాడని వెల్లడించాడు.