Politics

నాకు CRPF బలగాలతో రక్షణ కావాలి-నేరవార్తలు

నాకు CRPF బలగాలతో రక్షణ కావాలి-నేరవార్తలు

* తీన్మార్ మల్లన్న బెయిల్ నిరాకరణ. నాలుగు రోజుల పాటు తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీస్ కస్టడీకి ఇచ్చిన కోర్టు.

* మియాపూర్‌లోని ఓ విల్లాపై ఎస్వోటీ పోలీసుల దాడులు..పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన నటుడు కృష్ణుడు.

* టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో తనకు ప్రాణ హాని ఉందని కాబట్టి తనకు సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. ఇంకా చింతమనేని మాట్లాడుతూ.. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టడమే ఫ్రెండ్లీ పోలీసింగ్. ఆక్రమ కేసుల సినిమా చూపించటంలో రాంగోపాల్ వర్మను డీజీపీ మించిపోయారు. రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎందరో ఉండగా మీడియా సమావేశంలో నా పేరే డీజీపీ ఎందుకు ప్రస్తావించారు? 6093 ఆర్థిక నేరగాడి గురించి ప్రజలకు తెలిపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? నాపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయండి. టీడీపీ క్యాడర్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు నన్ను బంతిలా వాడుకుంటున్నారు. ఓ ఎస్పీ చింతమనేనిపై కేసులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ 1+1 ఆఫర్లు ప్రకటించారు. నా తప్పుంటే ఉరి శిక్షకైనా సిద్ధమే. కేసులు తొలగించమని దేహీ అని ఎవర్నీ అడగలేదు. నేను వనజాక్షి సమీపంలో కూడా లేనని ఆమె ఫిర్యాదులో పేర్కొంటే, అసెంబ్లీలో జగన్ రెడ్డి చెప్పిన కట్టుకథల్ని డీజీపీ వినిపించారు’’ అని పేర్కొన్నారు.

* తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా బస్సును అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గోకవరం నుంచి పాతకోట వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులు సుమారు 30 మంది ప్రయాణీకులున్నారు.

* హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది.కాంగ్రెస్ భవన్ ఎదురుగా ఉన్న సెల్ షాప్ యజమాని పై పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.