Movies

బ్యాంకు లావాదేవీలు…క్లబ్బులో కెల్విన్‌పై రానాకు ఈడీ ప్రశ్నలు

బ్యాంకు లావాదేవీలు…క్లబ్బులో కెల్విన్‌పై రానాకు ఈడీ ప్రశ్నలు

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోన్న మాదకద్రవ్యాల కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. బుధవారం నటుడు రానాను ఈడీ అధికారులు విచారించారు. దాదాపు 7గంటలకు ఈ విచారణ కొనసాగింది. ప్రధాన నిందితుడు కెల్విన్‌తో లావాదేవీల గురించి రానాను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు కెల్విన్‌ఎవరో తెలియదని రానా చెప్పినట్లు సమాచారం. అయితే, మనీ లాండరింగ్‌ కోణంలో రానా బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు పరిశీలించి, అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎఫ్‌ క్లబ్ విషయమై రానాను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో పాటు సినీ ప్రముఖులు పూరీ, ఛార్మి, రకుల్‌, నందులను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం.