DailyDose

బెజవాడలో గుట్కా స్వాధీనం. గుంటూరులో దారి కాచి అత్యాచారం-నేరవార్తలు

బెజవాడలో గుట్కా స్వాధీనం. గుంటూరులో దారి కాచి అత్యాచారం-నేరవార్తలు

* విజయవాడలో భారీ మొత్తంలో నిషేధిత గుట్కా మరియు ఖైనీ ప్యాకెట్లు పట్టివేత నిందితుల వద్ద నుండి రూ.13,54,080/- విలువైన 2,14,320లస్ గుట్కా మరియు ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసు..

* గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది….◆ గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి చేశారు.◆ అనంతరం మహిళపై దుండగుల అత్యాచారం చేశారు.◆ కత్తులతో బెదిరించి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.◆ ఈ ఘటన మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఘటన చోటు చేసుకుంది.◆ ఈ ఘటనపై మేడికొండూరు పోలీస్ స్టేషన్‎లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.◆ బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* కామారెడ్డి జిల్లా కేంద్రములోని ఒక అనాథ అమ్మాయిని చెరదిసిన మదర్ తెరిస్సా అవార్డ్ గ్రహీత విక్టోరియా సుగుణ ,అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పధి నేలల క్రితం అమ్మాయి తల్లీ మరణించడంతో అమ్మాయి అనాథ అయింది అన్నారు, ఇప్పుడు ఆ అనాధ అమ్మాయి 9 నేలల గర్భవతి అయ్యిందని ఈ అమ్మాయికి తోడు ఎవరులేకపోవటం చాలా భాధ కరమైన విషయం అన్నారు, ఈ అమ్మాయికి కావలసి అన్ని భాద్యతలను తీసుకుంటున్నాను అని తెలిపారు, ఇక నుండి ఈ అమ్మాయి అనాథ కాదు అని వారు చెప్పారు, అదే విధంగా జాతీయ మానవ హక్కుల చైల్డ్ రైట్స్ డైరెక్టర్ దాస్ ఎల్లం మాట్లాడుతూ భాలల హక్కులు కాల రాస్తున్న వారు ఎంతటివారైనా క్షమించేది లేదు చట్ట రిత్యచర్యలు తీసుకోవాల్సిందే అని తెలిపారు. గర్భానికి కారకులైన మానవ మృగాలను అరెస్ట్ చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

* సాక్షి మీడియాపై కోర్టు ధిక్కరణ పిటిషన్…విచారించిన నాంపల్లి సీబీఐ కోర్టు.జగన్ బెయిల్ పై తీర్పు న్యాయస్థానంలో పెండింగ్లో ఉండగా బెయిల్ పిటిషన్ కొట్టివేశారని సాక్షి మీడియా కథనం .దీనిపై కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు .ఎడిటర్ మురళి సీఈఓ వినయ్ మహేశ్వరికి సమన్లు ఇచ్చిన న్యాయస్థానం .నేడు విచారణకు హాజరైన మురళి వినయ్ మహేశ్వరులు .కౌంటర్ దాఖలుకు రెండు వారాలు గడువు కోరిన సాక్షి మీడియా.సోమవారం లో గా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం .తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసిన సీబీఐ కోర్టు.

* జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద చోటు చేసుకుంది. ఘటనలో మరో మగ్గురికి గాయాలయ్యాయి. రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మహిళ, యువకుడు చనిపోయారు. కారులో ఉన్న మిగతా ముగ్గురు గాయపడటంతో వారిని అంబులెన్స్‌లో తుని ఆస్పత్రికి తరలించారు. మృతులను రాజమహేంద్రవరానికి చెందిన మహిళ పట్నాల రాము, రమణ(21)గా గుర్తించారు.

* భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్లలో గురువారం జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ ఎదుట 52 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, సానుభూతిపరులు లొంగిపోయారు. మండలంలోని పూషుగుప్ప, భట్టిగూడెం, బత్తినపల్లి, చెన్నాపురం గ్రామాలకు చెందిన మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్లు చెప్పారు. మావోయిస్టులు తమ కార్యకలాపాలు వీడి ఇకనైనా జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో ఓఎస్డీ తిరుపతి, ఏఎస్పీ వినీత్‌, సీఐ అశోక్‌, తదితర అధికారులు పాల్గొన్నారు.